Kalyan Ram: బింబిసార 2లో ఎన్టీఆర్ ?.. క్లారిటీ ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్..

ఆదివారం ఉదయం హీరో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ వశిష్ట్, నటుడు శ్రీనివాస్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Kalyan Ram: బింబిసార 2లో ఎన్టీఆర్ ?.. క్లారిటీ ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్..
Kalyan Ram
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 31, 2022 | 3:06 PM

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram), భీమ్లానాయక్ బ్యూటీ సంయుక్త మీనన్ జంటగా నటిస్తోన్న సినిమా బింబిసార (Bimbisara). డైరెక్టర్ విశిష్ట ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతుండగా.. హీరోయిన్ కేథరిన్ కీలకపాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ తో సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా పవర్ ఫుల్ లుక్ లో కనిపించనున్నాడు. ఆగస్ట్ 5న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఇటీవలే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. అయితే బింబిసార చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కించనున్నారని.. సెకండ్ పార్ట్ బింబిసార 2లో తారక్ కీలకపాత్రలో నటించనున్నట్లు గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలపై స్పష్టతనిచ్చాడు కళ్యాణ్ రామ్.

ఆదివారం ఉదయం హీరో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ వశిష్ట్, నటుడు శ్రీనివాస్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానిలిచ్చారు బింబిసార చిత్రయూనిట్. ఈ సందర్భంగా.. బింబిసార 2లో యంగ్ టైగర్ నటిస్తున్నాడా ? ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు ? అని మీడియా అడగ్గా.. కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. బింబిసార 2లో ఎన్టీఆర్ నటిస్తాడు అనేది వాస్తవం కాదు. ఈ విషయం గురించి ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. కేవలం ఇవన్ని రూమర్స్ మాత్రమే. ముందు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకువద్దాం అనుకున్నాం. అందుకు స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాం. కానీ బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని పార్ట్ 1ని రూపొందించాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూసిన తర్వాత పార్ట్ 2 ఎప్పుడు వస్తుందనే ఆసక్తి నెలకొంటుంది. అప్పుడే బింబిసార 2 తెరకెక్కిస్తాం. ఈ చిత్రానికి కేవలం ఒకటి కాదు అనేక సిక్వెల్స్ చేయాలనుకుంటున్నాం. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ