Laal Singh Chaddha: లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ పాత్రకు ఏఎన్నార్‏కు మధ్య సంబంధం ఏంటో తెలుసా..

ఇప్పటికే విడుదలైన చైతూ, అమీర్ ఫోటోస్ , ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Laal Singh Chaddha: లాల్ సింగ్ చద్దా సినిమాలో చైతూ పాత్రకు ఏఎన్నార్‏కు మధ్య సంబంధం ఏంటో తెలుసా..
Naga Chaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2022 | 6:18 PM

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రోల నటిస్తోన్న చిత్రం లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). ఇందులో టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో చైతూ బీటౌన్‏లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన చైతూ, అమీర్ ఫోటోస్ , ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల సినిమా నుంచి నాగచైతన్య పాత్రకు సంబంధించి ఓ స్పషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చైతూ బాలరాజు అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ రోల్ కోసం చైతూ పడిన కష్టాలను ఆ వీడియోలో చూపించగా..తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు చైతూ.

అయితే ఈ సినిమాలో చైతూ పోషించిన బాలరాజు పాత్రకు.. అక్కినేని నాగేశ్వర రావుతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పుకొచ్చాడు చైతూ. ఈ రోల్ కోసం చైతూ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. ఆ వీడియోలో చైతూ మాట్లాడుతూ.. ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర బాల. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన ఓ యువకుడు. బాలరాజు ఇంటి బోడిపాలం. నా పాత్ర కోసం అనేక పేర్లను పరిశీలించాము. కానీ చిత్రయూనిట్ కు, అమీర్ సర్ కు బాలరాజు పేరు నచ్చింది. మా తాత్య బాలరాజు అనే సినిమాలో నటించడం ఓ మ్యాజిక్. ఇప్పుడు అలాంటి పాత్రలో నేను కనిపించనున్నాను. షూటింగ్ కంప్లీట్ అని చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. షూటింగ్ జరిగినన్ని రోజులు నేనొక కొత్త ప్రపంచాన్ని చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను హాలీవుడ్ క్లాసిక్ పారెస్ట్ గంప్ కు హిందీ రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!