NTR Fane Died: NTR చెప్పిన జాగ్రత్తలు.. ఆ అభిమాని మరణాన్ని అపలేకపోయాయి..

NTR Fane Died: NTR చెప్పిన జాగ్రత్తలు.. ఆ అభిమాని మరణాన్ని అపలేకపోయాయి..

Anil kumar poka

|

Updated on: Jul 30, 2022 | 9:11 PM

భారీవర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. కంగారుపడకండి.. జాగ్రత్తగా.. జాగ్రత్తగా వెళ్లండి.. మీ కోసం మీ భార్య, పిల్లాపాపలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. దయచేసి జాగ్రత్తగా వెళ్లండి.. ఇది అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ విజ్ఞప్తి.


భారీవర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. కంగారుపడకండి.. జాగ్రత్తగా.. జాగ్రత్తగా వెళ్లండి.. మీ కోసం మీ భార్య, పిల్లాపాపలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు. దయచేసి జాగ్రత్తగా వెళ్లండి.. ఇది అభిమానులకు జూనియర్‌ ఎన్టీఆర్‌ విజ్ఞప్తి. అయితే భారీవర్షాలపై యంగ్ టైగర్ అప్రమత్తం చేసిన కాసేపటికే విషాదం చోటుచేసుకుంది. ఓ అభిమాని కుటుంబానికి తీవ్ర దుఖం సంభవించింది.ఇక తాజాగా శిల్పకళావేదికలో బింబిసార మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. అభిమాన నటులు NTR,NKRలను చూసేందుకు ఏపీలోని తాడేపల్లిగూడెంకు చెందిన సాయిరాం కూడా ఈవెంట్‌కు వచ్చాడు. ఉత్సాహంగా ఈవెంట్లో చిందులువేశాడు. తన ఫెవరెట్ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూసి ఆనందించాడు. ఈవెంట్‌ ఆఖరులో వర్షాలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ చెప్పిన జాగ్రత్తలనూ విన్నాడు. ఈవెంట్‌ ముగిసింది. తారలంతా ఒక్కొక్కరుగా ఇంటికివెళ్లారు. అభిమానులు కూడా.. ఈవెంట్ నుంచి తిరిగుముఖం పట్టారు. కాని ఏమైందో ఏమో తెలియదు.. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న సాయిరాం విగతజీవిగా మారాడనే న్యూస్ … అందరికీ తెలిసిపోయింది. సాయిరాం ఫ్యామిలీతో పాటు.. నందమూరి హీరోలను కూడా కలిచివేసింది. ఇక ఈ ఘటన పై తాజాగా స్పందించింది NTR క్రియేషన్స్ టీం. సాయిరాం కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటామని పోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 30, 2022 09:11 PM