Ajith Kumar: తెరపైనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ హీరోనే.. షూటింగ్ ఛాంపియన్‏గా అజిత్.. ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడో తెలుసా..

అజిత్ షూటింగ్ కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Ajith Kumar: తెరపైనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ హీరోనే.. షూటింగ్ ఛాంపియన్‏గా అజిత్.. ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాడో తెలుసా..
Ajith
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2022 | 4:28 PM

వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్‏లోనూ హీరో అనిపించుకున్నాడు తమిళ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar). 47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‏షిప్‏లో పాల్గోన్న అజిత్..ఏకంగా నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఇదే పోటీలో రెండు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. అజిత్ షూటింగ్ కు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 47వ తమిళనాడు రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‏షిప్ పోటీలో ఈ వారం ప్రారంభంలో తిరుచ్చి రైఫిల్ క్లబ్ లో జరిగింది. ఇందులో హీరో అజిత్ తోపాటు అతని టీం సైతం పాల్గొంది.

CFP మాస్టర్ పురుషుల జట్టు, స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషుల జట్టు (NR), స్టాండర్డ్ పిస్టల్ మాస్టర్ పురుషుల జట్టు (ISSF), 50m FP మాస్టర్ పురుషుల టీమ్ ఈవెంట్ లో అజిత్ నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నాడు. అలాగే 50m FP పురుషుల జట్టు, స్టాండర్డ్ పిస్టల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లలో రెండు కాంస్య పతకాలను సైతం సొంతం చేసుకున్నారు. అజిత్ గెలుచుకున్న గోల్డ్ మెడల్స్ గురించి.. ఆయనకు సంబంధించిన ఫోటోలను ప్రముఖ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. దీంతో అజిత్ కు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి
Ajith Kumar

Ajith Kumar

వెండితెరపై ఎప్పటికీ స్టార్.. నిజ జీవితంలోనూ దూసుకుపోతున్నాడు.. కొందరు తెరపై హీరోలు.. కానీ ఆఫ్ స్క్రీన్ లో అజిత్ నిజమైన హీరో.. రేసింగ్ అయినా. షూటింగ్ అయినా ఆయనే నెంబర్ వన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 50 ఏళ్ల వయసులో క్రీడలలో గోల్డ్ మేడల్స్ గెలుచుకోవడం పట్ల అజిత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అజిత్ చివరిసారిగా డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వాలిమై సినిమాలో కనిపించాడు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో కనిపించగా.. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?