AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే నేచురల్ గ్లో! కరీనా కపూర్ డైటీషియన్ షేర్ చేసిన ‘ఘర్ కా స్టఫ్’ చిట్కాలు

చర్మం కాంతివంతంగా ఉండటం అనేది కేవలం పైన పూసే క్రీములపైనే ఆధారపడి ఉండదు. మనం ఏం తింటున్నాం, ఎంత సమయం నిద్రపోతున్నాం, మన జీవనశైలి ఎలా ఉందనేది ముఖ్యం. "ఈ ఏడాది సహజంగా ఉండండి.. మెరిసిపోయే 2026ని మీ సొంతం చేసుకోండి" అంటూ రుజుతా తన స్కిన్ కేర్ రహస్యాలను బయటపెట్టారు. ఇందులో ఒక్క పైసా ఖర్చు లేకపోవడం విశేషం.

ఇలా చేస్తే నేచురల్ గ్లో! కరీనా కపూర్ డైటీషియన్ షేర్ చేసిన ‘ఘర్ కా స్టఫ్’ చిట్కాలు
Skin
Nikhil
|

Updated on: Mar 12, 2026 | 6:42 AM

Share

నేటి కాలంలో చర్మ సంరక్షణ అంటే కనీసం 5-6 రకాల ఖరీదైన ఉత్పత్తులు వాడాలని చాలామంది భావిస్తుంటారు. క్లెన్సర్, టోనర్, సీరమ్, మాయిశ్చరైజర్ అంటూ గంటల తరబడి అద్దం ముందు గడుపుతుంటారు. కానీ, వెండితెరపై మెరిసిపోయే కరీనా కపూర్, కరిష్మా కపూర్ వంటి తారలకు ఫిట్‌నెస్, డైట్ ప్లాన్స్ రూపొందించే ప్రముఖ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన బాటను చూపిస్తున్నారు. ఆమె పంచుకున్న తన నో-ప్రొడక్ట్ స్కిన్ కేర్ రొటీన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

1. హైడ్రేషన్

చర్మ సంరక్షణలో అత్యంత ముఖ్యమైన అడుగు నీరు తాగడం. దాహం వేసే వరకు ఎదురుచూడకుండా, నీళ్ల బాటిల్ ఎప్పుడూ కంటికి కనిపించేలా దగ్గరే ఉంచుకోవాలని ఆమె సూచిస్తున్నారు. “నీరు కనిపిస్తే చాలు.. నేను తాగేస్తాను” అని ఆమె పేర్కొన్నారు. ఇది చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచి, ముడతలు రాకుండా చేస్తుంది.

2. సరైన నిద్ర

రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం చర్మానికి పెద్ద శత్రువు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప, రుజుతా రాత్రి 9:30 నుండి 10:00 గంటల మధ్యలో నిద్రపోతారు. ఆమె నైట్ అవుల్ కాదు, మార్నింగ్ పర్సన్. సరైన నిద్ర చక్రం పాటించడం వల్ల కళ్ల కింద నలుపు తగ్గడమే కాకుండా చర్మం తాజాగా కనిపిస్తుంది.

3. క్రమం తప్పకుండా వ్యాయామం

శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి. మరీ కష్టతరమైన వర్కవుట్లు చేయాల్సిన అవసరం లేదు, క్రమబద్ధంగా కదిలితే చాలు. అయితే, వ్యాయామాన్ని ఉదయం 9 గంటల లోపే పూర్తి చేయాలని ఆమె తన అనుచరులను కోరుతున్నారు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది.

4. సోషల్ మీడియా మాయలో పడకండి

ఇది అత్యంత ఆసక్తికరమైన అడుగు. టైటిల్‌లో ‘స్కిన్ కేర్ రూటీన్’ అని ఉన్న వీడియోలను ఆమె అస్సలు చూడరు. అలాగే ’20 ఏళ్లు చిన్నగా కనిపిస్తారు’ అనే యాంటీ ఏజింగ్ వీడియోలకు ఆమె చాలా దూరంగా ఉంటారు. ఇతరుల ప్రయోగాలు చూసి మీ చర్మంపై రసాయనాలు వాడటం ఆపాలని ఆమె హితవు పలికారు.

“నేను ఇన్నాళ్లూ నా చర్మాన్ని ఇలాగే కాపాడుకుంటూ వచ్చాను” అని రుజుతా గర్వంగా చెబుతున్నారు. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వెంట పడకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకుంటే చర్మం దానంతట అదే మెరుస్తుంది. మరి మీరు కూడా ఈ ‘నో-ప్రొడక్ట్’ రొటీన్‌ను ప్రారంభిస్తారా?

Follow Us