AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గ్లోయింగ్, ముడతలు లేని స్కిన్ రహస్యం ఈ జ్యూస్‌ తాగడమా?

చాలామంది రెటినోల్ అనగానే చర్మంపై రాసుకునే క్రీములే అనుకుంటారు. కానీ, దానిని ఆహారం రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు. "నేను నా రోజును రెటినోల్ జ్యూస్‌తో ప్రారంభిస్తాను. ఇది చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది" అంటూ మలైకా తన అభిమానులకు దీనిని సిఫార్సు చేశారు. ఈ జ్యూస్ తయారీ విధానం, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గ్లోయింగ్, ముడతలు లేని స్కిన్ రహస్యం ఈ జ్యూస్‌ తాగడమా?
Malaika Arora In Fitness
Nikhil
|

Updated on: Mar 12, 2026 | 7:15 AM

Share

బాలీవుడ్ సీనియర్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా తన అందం, ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసు పెరుగుతున్నా ఆమె ఇంకా కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చేలా మెరిసిపోవడానికి కారణం ఆమె తీసుకునే పోషకాహారమే. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆమె తన మార్నింగ్ డ్రింక్ రహస్యాన్ని బయటపెట్టారు. అదే రెటినోల్ జ్యూస్. మేకప్ రూమ్‌లో జుట్టును సరిచేయించుకుంటూనే ఈ హెల్తీ జ్యూస్ తాగుతూ ఆమె కనిపించారు.

Malaika Arora's Healthy Juice

Malaika Arora’s Healthy Juice

రెటినోల్ జ్యూస్ తయారీకి కావాల్సినవి:

  • 2 క్యారెట్లు
  • అర కీరదోసకాయ
  • ఒక నారింజ పండు
  • సగం నిమ్మరసం
  • అంగుళం అల్లం ముక్క

తయారీ విధానం

మొదట క్యారెట్లు, దోసకాయ, అల్లం శుభ్రంగా కడిగి పైన తొక్క తీయాలి. వాటన్నింటినీ జ్యూసర్‌లో వేసి రసం తీయాలి. అందులో నారింజ రసం మరియు నిమ్మరసం కలపాలి. చివరగా వడకట్టి వెంటనే తాగేయాలి. వడకట్టిన తర్వాత మిగిలిన పిప్పిని పారేయకుండా పరోటాల తయారీలో వాడుకోవచ్చని మలైకా సూచించారు.

ఈ జ్యూస్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ ఏ (రెటినోల్) గా మారుతుంది.

  • చర్మ సౌందర్యం‌‌: ఇది చర్మ కణాల పునరుద్ధరణకు తోడ్పడుతుంది. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
  • కొల్లాజెన్ ఉత్పత్తి: నిమ్మ, నారింజలో ఉండే విటమిన్ సి శరీరంలో కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.
  • యాంటీ ఆక్సిడెంట్లు: శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి జరిగే నష్టాన్ని ఈ జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు అడ్డుకుంటాయి.

అంతేకాదు, ఒక పాడ్‌కాస్ట్‌లో సోహా అలీ ఖాన్‌తో మాట్లాడుతూ మలైకా తన ఆహారపు అలవాట్లపై మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు టీ, కాఫీ తాగే అలవాటు అస్సలు లేదని, ఉదయాన్నే కేవలం కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తాగడానికే ఇష్టపడతానని ఆమె తెలిపారు.

చిన్నప్పటి నుండి పాలు తాగడం అలవాటని, కెఫిన్ ఆధారిత పానీయాల కంటే ప్రకృతి సిద్ధమైన పానీయాలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆమె నమ్ముతారు. అందం అనేది బయటి పూతలతో మాత్రమే రాదు, మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుంది. మలైకా అరోరా లాగా మీ చర్మం కూడా మెరిసిపోవాలంటే, రేపటి నుంచి మీ రోజును ఈ హెల్తీ రెటినోల్ జ్యూస్‌తో ప్రారంభించి చూడండి!

Follow Us