Yash: సరిహద్దులు దాటిన ప్రేమ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కేజీఎఫ్ స్టార్.. విషయం ఏంటంటే..

నాపై మీ ప్రేమ సరిహద్దులు దాటిపోయింది. నేను దీనిని ముక్తకంఠంతో అంగీకరిస్తున్నాను. ఇటలీ, బంగ్లాదేశ్ నుంచి

Yash: సరిహద్దులు దాటిన ప్రేమ.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కేజీఎఫ్ స్టార్.. విషయం ఏంటంటే..
Yash
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 30, 2022 | 4:53 PM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‏ను ఏలేస్తుంది సౌత్ ఇండస్ట్రీ. తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించాయి. బాహుబలి, కేజీఎఫ్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 (KGF 2) సినిమాలు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్స్ గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోలలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ఒకరు. కేజీఎఫ్ సిరీస్‏తో యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా యశ్ కు అభిమానులు పెరిగిపోయారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తన కుటుంబంతో కలిసి ఇటలీ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ యశ్ ను (Yash) చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. వారితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు యశ్.

“నాపై మీ ప్రేమ సరిహద్దులు దాటిపోయింది. నేను దీనిని ముక్తకంఠంతో అంగీకరిస్తున్నాను. ఇటలీ, బంగ్లాదేశ్ నుంచి నన్ను కలవడానికి వచ్చిన అభిమానులకు చాలా ధన్యవాదాలు. ఈ పోస్ట్ చేయడం చాలా ప్రత్యేకంగా ఉంది. ” అంటూ తన ఫ్యాన్స్ తో దిగిన ఫోటోను షేర్ చేశారు యశ్. అందులో యశ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పూర్తిగా కేజీఎఫ్ లుక్ లో కనిపిస్తున్నారు. యశ్ తోపాటు అతని భార్య రాధిక సైతం ఫోటోలో కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Yash (@thenameisyash)

ఇదిలా ఉంటే..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రానికి ఫ్రాంచైజీగా కేజీఎఫ్ 3 ఉంటుందని గతంలోనే యశ్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?