AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐఫోన్‌కు పోటీగా షాయోమీ నుంచి క్రేజీ ఫోన్‌! మైండ్‌బ్లాంక్‌ అయ్యే ఫీచర్లు, ధర!

షాయోమీ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు Xiaomi 17, 17 Ultra లను భారత్‌లో విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, ట్రిపుల్ 50MP కెమెరా, 120Hz OLED డిస్‌ప్లే, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో ఇవి Apple, Samsung లకు గట్టి పోటీనివ్వనున్నాయి.

ఐఫోన్‌కు పోటీగా షాయోమీ నుంచి క్రేజీ ఫోన్‌! మైండ్‌బ్లాంక్‌ అయ్యే ఫీచర్లు, ధర!
Xiaomi 17 India Price
SN Pasha
|

Updated on: Mar 12, 2026 | 8:30 AM

Share

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షాయోమీ భారత మార్కెట్లో తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ కొత్తగా Xiaomi 17, 17 Ultra మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ ప్రకారం ఈ హ్యాండ్‌సెట్‌లు అధిక పనితీరును అందించే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. అలాగే ట్రిపుల్ 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ వంటి హైఎండ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త 17 సిరీస్ విడుదలతో కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో బలమైన పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా యాపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌ వంటి కంపెనీలకు పోటీగా ఈ మోడళ్లను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కంపెనీ Xiaomi Pad 8 టాబ్లెట్‌ను కూడా విడుదల చేసింది. ధర విషయానికి వస్తే Xiaomi 17 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ.89,999గా నిర్ణయించగా, 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,999గా ఉంది. అయితే ప్రారంభ సేల్‌లో 512GB వేరియంట్‌ను రూ.89,999కే అందిస్తున్నారు. ఈ ఫోన్ బ్లాక్‌, వెంచర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. తొలి సేల్ మార్చి 13 నుంచి మార్చి 17 వరకు కొనసాగుతుంది. తరువాత మార్చి 18 నుంచి అమెజాన్‌ ఇండియా, షాయోమీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్ల విషయానికి వస్తే Xiaomi 17లో 6.3 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఇది వీడియోలు చూడడం, గేమింగ్ చేయడం వంటి పనులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఫోన్‌లో LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. అలాగే కంపెనీ కొత్త HyperOS ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. కెమెరా పరంగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే, 6,330 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇది వస్తుంది. 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్లతో Xiaomi 17 భారతదేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బలమైన పోటీని అందించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us