AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాలా కాలం తర్వాత ఇప్పుడు.. రవితేజ సినిమాలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన అతను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు .

చాలా కాలం తర్వాత ఇప్పుడు.. రవితేజ సినిమాలో కీలక పాత్రలో ఆ స్టార్ హీరోయిన్..
Raviteja
Rajeev Rayala
|

Updated on: Mar 12, 2026 | 7:53 AM

Share

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం మాస్ రాజా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంటే.. రవితేజ సినిమాలు మాత్రం నిరాశపరిస్థున్నాయి. దాంతో రవితేజకు సాలిడ్ హిట్ పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చివరిగా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ సినిమాలో మెయిన్ హీరో చిరంజీవి కావడంతో ఆ హిట్ కాస్త ఆయన ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆతర్వాత రవితేజ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. మాస్జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల తర్వాత ఇప్పుడు ఇరుముడి అనే సినిమాతో రానున్న రవితేజ.

రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకే జోనర్ లో సినిమాలు చేయకుండా అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఇంకెప్పటికే ఎన్నో రకాల సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఇరుముడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయ్యప్ప స్వామి మల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ తో సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఇరుముడి సినిమాలో ఓ ఓ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, ఆమె కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తమన్నా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. గతంలో రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాలో తమన్నా నటించింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీలో సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది. తెలుగులో తమన్నా హిట్ అందుకొని చాలా కాలం అవుతుంది.  చివరిగా ఓదెల 2 సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు ఇరుముడి సినిమాలో కీలక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
వన్‌ప్లస్‌ ప్రియులకు షాక్..! త్వరలో భారత్‌‌లో దుకాణం బంద్..?
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
కీళ్ళనొప్పులు తగ్గించి, వయసు కనబడకుండా చేసే మటన్ బోన్ చారు..
ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు..
ప్రభాస్ నుంచి తీసుకోవడానికి ఏమీ లేదు..