Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమన్నా భాటియా

తమన్నా భాటియా

తమన్నా భాటియా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయిక. అభిమానులు ఆమెను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 1989 డిసెంబర్ 21న ముంబైలో సంతోష్, రజనీ భాటియా అనే దంపతులకు జన్మించింది. ముంబైలో మేనకాజీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులోనే నటనపై ఆసక్తితో యాక్టింగ్ స్కూల్లో చేరి శిక్షణ తీసుకుంది. 2005లో అభిజీత్ సావంత్ రూపొందించిన ఆప్కా అభిజీత్ లోని లఫ్జో మే పాటతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో చాంద్ సా రోష్ చెహ్రా సినిమాతో హీరోయిన్ గా మారింది. 2006లో మంచు మనోజ్ నటించిన శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. ఆ మరుసటి ఏడాది శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత తమన్నాకు తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. సౌత్ ఇండస్ట్రీలో అనేక చిత్రాల్లో నటించిన తమన్నా.. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ సత్తా చాటుతుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ పాటలతో రచ్చ చేస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో తమన్నా ఒకరు.

ఇంకా చదవండి

ఇదెప్పుడు జరిగింది..! విజయ్ దేవరకొండతో తమన్నా కలిసి నటించిందా..? వీడియో

ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు యావరేజ్ గా నిలిచినా విజయ్ దేవరకొండ అభిమానులను మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అంతకు మించి విజయ్ ఫ్యాన్స్ ఇంకేదో కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే విజయ్ కూడా కింగ డమ్ పేరుతో ఓ డిఫరెంట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది

Tamannah: ఏం లక్కీ ఛాన్స్ అమ్మడు.. ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది హీరోయిన్ తమన్నా. తెలుగుతోపాటు తమిళం భాషలలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పటికీ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.

Odela 2 Movie review: ఓదెల 2 మూవీ రివ్యూ.. తమన్నా సోలో హిట్ కొట్టిందా..?

2022లో ఆహాలో నేరుగా విడుదలైన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. అప్పట్లో ఓటిటిలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ఓదెల 2 తెరకెక్కించారు సంపత్ నంది. దర్శకత్వం మాత్రమే చేయలేదు గానీ ఈ సినిమాకు కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే. పైగా తమన్నా రాకతో స్టార్ వ్యాల్యూ కూడా పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
దాని కోసమే వేయిటింగ్.. మీనాక్షి చౌదరి చిన్ని కోరిక ఏంటో తెలుసా?
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
ఫిజీలో శివాలయంపై దాడి.. 100 ఏళ్ల నాటి విగ్రహాల ధ్వంసం..
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
రక్తం తాగే పిశాచిలా మారిపోయిన క్రేజీ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
మరోసారి వైభవ్ ఊహకందని ఊచకోత.. ఈసారి 36 బంతుల్లో..!
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
ఈ తేదీల్లో జన్మించిన వారిపై శుక్రుని ఆశీస్సులు సక్సెస్ వీరి సొంతం
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు అయ్యేనా..!? ఆ చర్చలపైనే అందరి ఆశలు..
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
ఏంటీ .. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!!
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
విదేశాల్లో ఉన్న ఈ ఫేమస్ శివాలయాల గురించి తెలుసా?
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
ఆపినా ఆగకుండా దూసుకెళ్తున్న బొలెరో వాహనం.. పట్టుకుని చెక్ చేయగా..
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే
నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే అలవాట్లు ఇవే.. ఎలా గుర్తించాలంటే