- Telugu News Photo Gallery Cinema photos Do You Know Nayanthara First Choice For Karthi Awaara Movie Before Tamannah
Tamannah: ఏం లక్కీ ఛాన్స్ అమ్మడు.. ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది హీరోయిన్ తమన్నా. తెలుగుతోపాటు తమిళం భాషలలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పటికీ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే.
Updated on: Apr 30, 2025 | 10:49 AM

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పుటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది.

అయితే తమన్నా కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఆవారా. సూర్య తమ్ముడిగా సినీరంగంలోకి వచ్చిన కార్తీకి ది బెస్ట్ హిట్ ఇచ్చిన మూవీ ఇదే. ఇందులో కార్తీ సరసన తమన్నా కథానాయికగా నటించి మెప్పించింది.

చిత్రంలో ఆమె క్యూట్ లుక్స్, ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా కార్తి, తమన్నా జోడికి అడియన్స్ ఫిదా అయిపోయారు. వీరిద్దరు కెమిస్ట్రీ బాగుందంటూ ప్రశంసలు సైతం వచ్చాయి.

అయితే ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరోయిన్ తమన్నా కాదట. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరంటే లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ సినిమా కథ విని ఆమె నటించేందుకు ఓకే చెప్పిందట.

అయితే కొన్ని విషయాల్లో డైరెక్టర్ లింగుస్వామికి, నయనతారకు బేదాభిప్రాయాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి నయన్ తప్పుకుందని.. దీంతో ఈ మూవీ ఛాన్స్ తమన్నాకు వచ్చిందట. ఈ సినిమాలో నటించే సమయానికి తమన్నా వయసు 19 ఏళ్లే.




