- Telugu News Photo Gallery Cinema photos Srinidhi Shetty gives clarity about her ramayana movie rejection
Srinidhi Shetty: ఆ మూవీని రిజక్ట్ చేసేంత స్థాయి నాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి
కేజీయఫ్ శ్రీనిధి శెట్టి తెలుగులో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తున్నారు. తనను తాను ఎలివేట్ చేసుకుంటూనే.. కాంట్రవర్శీలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాటిట్యూడ్ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కలిసొస్తుందా? వయొలెన్స్... వయొలెన్స్... వయొలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్. బట్ వయొలెన్స్ లైక్స్ మీ.. అంటూ యష్ డైలాగుని రిపీట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి.
Updated on: Apr 29, 2025 | 8:58 PM

కేజీయఫ్ శ్రీనిధి శెట్టి తెలుగులో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తున్నారు. తనను తాను ఎలివేట్ చేసుకుంటూనే.. కాంట్రవర్శీలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాటిట్యూడ్ తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కలిసొస్తుందా?

వయొలెన్స్... వయొలెన్స్... వయొలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్. బట్ వయొలెన్స్ లైక్స్ మీ.. అంటూ యష్ డైలాగుని రిపీట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి.

ఆమెకు ప్యాన్ ఇండియా లెవల్ గుర్తింపు తెచ్చిపెట్టిన కేజీయఫ్ రెండు చాప్టర్లలోనూ వయొలెన్స్ ఎంత ఉందో స్పెషల్‌గా మెన్షన్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆమె నటిస్తున్న హిట్3కి ఎ సర్టిఫికెట్ వచ్చింది.

ఆద్యంతం హింసే ప్రధానంగా సాగుతున్నట్టు ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తేనే.. హింస నన్ను ఇష్టపడుతోందంటూ చమత్కరించారు శ్రీనిధి. ఎదుగుతున్న క్రమంలో కాంట్రవర్శీలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు ఈ బ్యూటీ.

నార్త్ రామాయణం మూవీని తాను రిజక్ట్ చేయలేదని చెప్పారు. జస్ట్ ఆడిషన్‌కి వెళ్లొచ్చానని, ఆ మూవీని రిజక్ట్ చేసే స్థాయికి ఇంకా తాను రీచ్ కాలేదని చెప్పారు. సీత కేరక్టర్‌ని శ్రీనిధి రిజక్ట్ చేస్తే పల్లవి ఓకే చేశారనే కాంట్రవర్శకి ఇలా స్మూత్‌గా ఫుల్ స్టాప్ పెట్టేశారన్నమాట కన్నడ హుడుగి.




