అందుకే బోల్డ్‌గా నటిస్తున్నా.. అలా చేస్తేనే ఇక్కడ ఉండగలం.. ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ హీరోయిన్
సినిమాలో కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెంటాడటం లేదు హీరోయిన్స్.. ఛాలెంజింగ్ రోల్స్ లోనే కాదు.. గ్లామర్ రోల్స్ లోనూ రెచ్చిపోయి నటిస్తున్నారు. అలాగే డీ గ్లామర్ లుక్ లోనూ కనిపించి మెప్పిస్తున్నారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకోవడానికి ఎంతో మంది హీరోయిన్స్ ప్రయత్నిస్తూ ఉంటారు. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడమే చాలా మందికి కష్టం.. కొంతమంది ఆఫర్స్ అందుకున్నా కూడా హీరోయిన్స్ గా రాణించలేరు. చాలా మంది హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. ఎంతో మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సెకండ్ హీరోయిన్స్‌గా, గెస్ట్ రోల్స్ చేస్తూ.. మెప్పిస్తున్నారు. మరికొంతమంది గ్లామర్ గేట్లు ఎత్తేసి.. అందాలతో కవ్విస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ఈ అందాల భామ ఒకరు. అందంలో ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఎవరైనా.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ చిన్నది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ తో ఊపేస్తోంది. బోల్డ్ సీన్స్ లో నటించడం వల్లే తన కెరీర్ మారిపోయిందని చెప్పుకొచ్చింది. అలాగే ఇక్కడ ఉండాలంటే అలా చేయాల్సిందే.!
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ వయ్యారి భామ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అందాల భామ తమ్మన్న ప్రస్తుతం బాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ చిన్నది తెలుగులో ఒకప్పుడు తోప్ హీరోయిన్.. చేసిన సినిమాలనే సూపర్ హిట్స్.. దాంతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. మంచు మనోజ్ నటించిన శ్రీ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది తమన్నా. ఆతర్వాత హ్యాపీడేస్ సినిమా ఈ చిన్నదానికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
కేవలం హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ తమన్నా తన సత్తా చాటింది. ఈ చిన్నది చేసిన స్పెషల్ సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. కెరీర్ బిగినింగ్ లో నేను కొన్ని కండీషన్స్ పెట్టుకున్నా అందుకే ఎన్నో మంచి ఛాన్స్ లు మిస్ చేసుకున్నా.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత నా కండీషన్స్ పక్కన పెట్టేశా.. బోల్డ్ , గ్లామర్ రోల్స్ చేయడం ప్రారంభించా.. దాంతో నా కెరీర్ టర్న్ అయ్యింది. నన్ను నేను మార్చుకోకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదు.. మనల్ని మనం మార్చుకుంటే ఎక్కడైనా నెగ్గుకురాగలం అని చెప్పుకొచ్చింది తమన్నా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. అటు ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.
మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








