Mahavatar Parshuram: మహావతార్ పరశురామ్ వచ్చేస్తున్నాడు..! నవంబర్ నుంచి పనులు మొదలు
ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం మహావతార్ నరసింహ. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ. 230 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మహావతార్ భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ సినిమాగా రికార్డుల కెక్కింది.
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా మహా అవతార్ నరసింహ. ఇప్పుడు పురాణ గాథల వైపు ఊపు తిరిగింది. దేవుళ్లతో పాటు చరిత్ర మరిచిపోయిన వీరుల కథలను వెలికితీసి ప్రేక్షకులకు అందజేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే ఇటీవల వచ్చిన ఏ యానిమేటెడ్ సినిమా.. అందర్నీ సర్‌ప్రైజ్ చేసింది. ‘కేజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఓ ఊహించని చిత్రాన్ని అందించింది. ఆ మూవీ పేరు మహావతార్ నరసింహ. కానీ ఇది రెగ్యులర్ సినిమా కాదు.. నటీనటుల్లేని, పూర్తి యానిమేషన్‌తో రూపొందిన సరికొత్త డివోషనల్ రైడ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది.
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
ఫస్ట్ డే రూ.1.75 కోట్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు రూ.4.6 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ.9.5 కోట్లు వసూల్ చేసుకుంటూ.. కలెక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతుంది. దాదాపు రూ. 300కోట్ల వరకు వసూల్ చేసి బాక్సాఫిస్ ను షేక్ చేసింది మహావతార్ నరసింహ. ప్రస్తుతం థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేస్తుంది. శ్రీ మహావిష్ణు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందించిన ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైంది. ఓవైపు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత మహావతార్ పరశురామ్ సినిమా రానుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు. దర్శకుడు అశ్విన్ కుమార్ మహావతార్ పరశురామ్ కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. నవంబర్ నుంచి అసలు వర్క్ మొదలుకానుందట. నరసింహా సినిమాకు మించి ఉండేలా పరశురామ్ సినిమాను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. 2027లో ఈ చిత్రాన్ని కచ్చితంగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక హోంబలే ఫిల్మ్స్ మహావతార్ యూనివర్స్‌లో భాగంగా వరుసగా సినిమాలను అనౌన్స్ చేశారు. 2025లో మహావతార్ నరసింహ, 2027లో మహావతార్ పరశురామ్, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు అనౌన్స్ చేశారు.
మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








