AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరు పిల్లల తల్లివి పద్దతిగా ఉండు..! ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్

సోషల్ మీడియా పుణ్యమా అని సినీ సెలబ్రెటీల జీవితంలో ఏం జరిగినా అది నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అలాగే కొంతమంది హీరోయిన్ నెటిజన్స్ వల్ల ట్రోల్స్ బారిన పడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ ట్రోల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

ఇద్దరు పిల్లల తల్లివి పద్దతిగా ఉండు..! ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2025 | 2:03 PM

Share

సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలు ఎంతలా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకొక్క హీరోయిన్ పేరుమీద వందలాది అకౌంట్స్ ఉంటాయి. హీరోయిన్స్ ఫోటోలను ఓ రేంజ్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు నెటిజన్స్. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ పై ట్రోల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా హీరోయిన్స్ తప్పుచేసినా ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్.. అలాగే ఎవరైనా హీరోయిన్ హాట్ ఫోటోలు పోస్ట్ చేసిన కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక తమ పై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కు కొంతమంది ముద్దుగుమ్మలు గట్టిగానే రియాక్ట్ అవుతూ ఉంటారు.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

తమ పై ట్రోల్ చేసే వారికి అదిరిపోయే కౌంటర్లు ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా అదే పని చేసింది. తన పై నెగిటివ్ కామెంట్స్ చేసిన నెటిజన్స్ పై  స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అందాల భామ అన్షు అంబానీ.. కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను కవ్వించింది అన్షు. ఆతర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలో మెరిసింది. ఆ తర్వాత టాలీవుడ్ కు లాంగ్ గ్యాప్ ఇచ్చింది. చాలా కాలం తర్వాత ఇటీవలే మజాకా అనే సినిమాలో నటించింది.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

సందీప్ కిషన్ నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అన్షు తన గ్లామరస్ ఫొటోలతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ ఫొటోల్లో అమ్మడు గ్లామర్ డోస్ కాస్త పెంచేసింది. అయితే కొంతమంది ఈ ముద్దుగుమ్మ పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. తన పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి అన్షు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇద్దరు పిల్లల తల్లివి.. కాస్త పద్దతిగా ఉండొచ్చుగా.. 20ఏళ్ల అమ్మాయివి అనుకుంటున్నావా.? సర్జరీ చేసుకోకముందే బాగుండేదానివి, ఇప్పుడు సన్నగా అయ్యావు. ఇలాంటి కామెంట్స్ చేసే బదులు ఏదైనా పని చేసుకోండి. ఎందుకంటే ఈ కామెంట్స్ చూస్తేనే మీరు ఎలాంటివారో ఆర్డమవుతుంది. ఇక నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. కనీసం లిప్స్ పీలర్ కూడా చేయించుకోలేదు. కానీ నాకే ఇబ్బందిగా అనిపించి స్లిమ్‌గా అయ్యా.. నేను ఇప్పుడు బాగానే ఉన్నా.. . మీకు సంతోషాన్ని కలిగించే పని మాత్రమే చేయండి.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది అన్షు.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..