Kannappa OTT : ఎట్టకేలకు ఓటీటీలో మంచు విష్ణు కన్నప్ప..! స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా కన్నప్ప. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా మోహన్ బాబు నిర్మించారు. అంతేకాకుండా ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సైతం కీలకపాత్ర పోషించారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల ముఖ్యమైన పాత్రలలో నటించారు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. మైథలాజికల్ కథతో తెరకెక్కిన కన్నప్ప సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. గతంలో ‘మహాభారతం’ కు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖేష్. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్నప్ప పాన్-ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం) విడుదలైంది.
సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే
ఇక ఈ సినిమాలో అతిథి పాత్రలలో మోహన్ బాబు, శివబాలాజీ, ప్రభాస్ (రుద్ర), అక్షయ్ కుమార్ (శివుడు), కాజల్ అగర్వాల్ (పార్వతి), మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ప్రీతి ముకుందన్ (హీరోయిన్), మధుబాల, బ్రహ్మానందం, రఘు బాబు తదితరులు నటించారు. సినిమా ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ చివరకు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.మంచు విష్ణు మలిచిన కన్నప్ప సినిమాను మరోసారి ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆడియన్స్. విడుదలై చాలా రోజులవుతున్నా ఇప్పటివరకు కన్నప్ప ఓటీటీపై ఎలాంటి అప్డేట్ రాలేదు. మాములుగా సినిమా విడుదలైన 7 ఉంచి 8వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు ముందే వచ్చేస్తాయి కూడా.. కానీ కన్నప్ప విడుదలై 10వారాలు అవుతున్నా ఓటీటీ అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు కన్నప్ప సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. కన్నప్ప ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 5న ఓటీటీలోకి విడుదల చేయనున్నారని అంటున్నారు, మరి సెప్టెంబర్ 5న కన్నప్ప ఓటీటీలోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.
సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








