Rahul Sipligunj: ఇదేం సర్‌ప్రైజ్ గురూ! ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవరంటే?
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అతను త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా రాహుల్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇక రాహుల్ కు కాబోయే భార్య విషయానికి వస్తే..

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. సినిమా పాటలు, మ్యూజిక్ వీడియోలతో బిజీ బిజీగా ఉండే ఈ హైదరాబాదీ సింగర్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఆదివారం (ఆగస్టు 17) తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుకు జరిగింది. అయితే రాహుల్ కానీ, అతని కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ ఎంగేజ్ మెంట్ ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రాహుల్‌కు కాబోయే సతీమణి పేరు హరిణి రెడ్డి అని తెలుస్తుంది. కానీ ఆమె గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నిశ్చితార్థం సందర్భంగా రాహుల్- హరిణీ రెడ్డి కలర్ ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీలో రాయల్ గా కనిపించగా, హరిణి ఆరెంజ్ కలర్ లెహంగాను ధరించి అందంగా ముస్తాబైంది. మొత్తానికి ఈ జంట చూడముచ్చటగా ఉందంటున్నారు అభిమానులు, నెటిజన్లు. అలాగే తన పెళ్లిపై రాహుల్ అధికారిక ప్రకటన కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ పాడిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టింది. దీంతో ఈ హైదరాబాద్ పోరడి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ క్రమంలోనే 2023లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి.. రాహుల్‌కు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించారు. అంతేకాదు కాంగ్రెస్ అధికారకంలోకి వస్తే కోటి రూపాయల బహుమతిస్తానని కూడా ప్రకటించారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇటీవలే రాహుల్ కు కోటి రూపాయల చెక్ ను అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ఆనందంలో ఉండగానే మరో గుడ్ న్యూస్ చెప్పాడీ టాలీవుడ్ సింగర్. తన మనసుకు నచ్చిన అమ్మాయిని ఎంగెజ్మెంట్ చేసుకుని అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
నెట్టింట వైరలవుతోన్న రాహుల్ సిప్లిగంజ్ ఎంగెజ్మెంట్ ఫొటోస్..
Singer #RahulSipligunj get engaged 🎊🎊🎊🎉🎉🎉🎉🎉 Congratulations anna✨✨✨🎁🎁🎁 pic.twitter.com/8dGqU1DIfF
— Sreedhar Sri (@SreedharSri4u) August 18, 2025
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల చెక్ అందుకుంటోన్న రాహుల్ సిప్లిగంజ్..
A true pride moment for me as an artist! 🙏❤️ On this special Independence Day 🇮🇳, I was honoured to receive a ₹1 Crore cheque from Hon’ble CM @revanth_anumula Anna #RevanthReddy garu, with my greatest blessing my #Mom ❤️ by my side, and heartfelt thanks to Smt.@ChekkaKarnan… pic.twitter.com/9rNDNXFswk
— Rahul Sipligunj (@Rahulsipligunj) August 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








