14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. దక్షిణాది చిత్రసీమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం భాషలలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

పైన కనిపిస్తున్న అమ్మాయిని చూశారా..? ఒకప్పుడు చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సత్తా చాటింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో హిట్ చిత్రాలతో నటించి సత్తా చాటింది. అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. అప్పటి కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆమె.. హీరోయిన్ గా రాణించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. దశాబ్దాలపాటు అనేక చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈహీరోయిన్.. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ పలు సినిమాలు చేసింది. సినిమాలతోనే కాకుండా ఇటు రాజకీయాలతోనూ ప్రజలకు దగ్గరగా ఉంటుంది.
ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ జయప్రద.. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ అందాల తార. స్కూల్లో ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా చూసి నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఆమెను ఇండస్ట్రీకి తీసుకువచ్చారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాల నిడివిగల పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు. అలా మొదలైన సినీ ప్రస్థానం దాదాపు 2005 వరకు సాగింది. అంటే మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా చిత్రాల్లో నటించి అలరించారు. కానీ తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది.
ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని అనుకుంది జయప్రద. కానీ అనుకోకుండా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయప్రద.. 1986 జూన్ 22న సినీ నిర్మాత నహతాను వివాహం చేసుకున్నారు. 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరిన ఆమె.. ఆ తర్వాత బిజేపీలోకి మారారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న జయప్రద.. రాజకీయాల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








