మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..!! డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు.. రష్మిక ఆవేదన
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది రష్మిక మందన్న. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఈ వయ్యారి. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంటుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.

సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతే కాదు హీరోయిన్స్ చాలా మంది లేనిపోని వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. వివాదాస్పద కామెంట్స్ చేసో లేక, వింత డ్రస్సుల వల్లో ఎదో ఒకరకంగా ట్రోల్స్ కు గురవుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం హీరోయిన్స్ అకారణంగా ట్రోల్స్ బారిన పడుతున్నారు. కొందరు కావాలనే హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తుంటారు.
ఇదికూడా చదవండి : ఏం పార్థు నన్నే మర్చిపోయావా..? నేను నీ పద్దుని.. ఎంత మారిపోయింది ఈ చిన్నది..
అలాగే కొందరు తన పై కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు. మరికొంతమంది పనిగట్టుకొని డబ్బులిచ్చి మరీ తన పై ట్రోల్స్ చేస్తున్నారని అంటూ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ భామ క్రేజ్ మరింత పెరిగిపోయింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన నటించింది. ఇటీవలే పుష్ప, పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
ఇదికూడా చదవండి :143 Movie : ఎన్నాళ్లకు కనిపించింది..!! 143 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రష్మిక తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ల గురించి ఆవేదనను వ్యక్తం చేసింది. నేను అన్ని ఎమోషన్స్ ఉన్న అమ్మయిని.. కానీ అవన్నీ నేను బయట పెట్టడానికి ఇష్టపడను.అలా చేస్తే నేను కెమెరా కోసం చేశాను అని అంటున్నారు. నాపై ట్రోల్ చేయడానికి కొందరు డబ్బు కూడా ఇస్తున్నారు.. నా ఎదుగుదలను కావాలనే అడ్డుకుంటున్నారు. బయట జనాలు క్రూరంగా ఎందుకు మారుతున్నారో అర్థం కావడం లేదు. ఇవన్నీ నన్ను బాధపెడుతున్నాయి. నాపై ప్రేమ చూపించకపోయిన పర్వాలేదు.. కానీ ప్రశాంతంగా ఉండండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రష్మిక మందన్న.
ఇదికూడా చదవండి : 53 సినిమాలు చేసింది.. హీరోయిన్‌గానే కాదు స్పెషల్ సాంగ్స్‌లోనూ దుమ్మురేపింది.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి








