AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లాంటి బడా హీరోతో సినిమాలు చేసింది.. కానీ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది

టాలీవుడ్ లో సత్తా చాటుతోన్న మలయాళ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ కూడా ఈ జాబితాకు చెందినదే. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ క్యూటీ తన నటనతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఈ అందాల తారకు క్రేజ్ ఎక్కువ.

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌లాంటి బడా హీరోతో సినిమాలు చేసింది.. కానీ ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2025 | 3:22 PM

Share

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ చిన్నది. మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత  హీరోయిన్ గా మారి వెండితెరపై సందడి చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ భామ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది.

సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే

ఇన్నాళ్లు హీరోయిన్ ప్రేక్షకులను అలరించిన ఈ వయ్యారి.. తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించి అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవలే ఓటీటీలో ఓ సూపర్ హిట్ సినిమాలో కనిపించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా థామస్. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇందులో అమ్మ పాత్రలో మెప్పించింది. 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించింది నివేదా.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

2002లో మలయాళంలో ఉత్తర అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై మై డియర్ భూతం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రేచేవారెవరురా, దర్బార్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్ తన తమ్ముడితో కలిసి తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ ఇద్దరి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ

నివేదా థామస్ ఇన్ స్టాగ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్