AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలర్ ఉండాలి, ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి.. అప్పుడే షోలకు పిలుస్తారు.. అసలు విషయం బయట పెట్టిన టీవీ నటి

బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది పాపులర్ అయ్యింది. ముఖ్యంగా సీరియల్ బ్యూటీస్.. ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని వారు కూడా బిగ్ బాస్ కు వెళ్లొచ్చాక విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇక బిగ్ బాస్ షో తర్వాత కొంతమంది కనిపించకుండా పోయారు. సినిమాలు, సీరియల్స్ తో బిజీగా ఉంటారని అంతా అనుకున్నా అలా జరగలేదు

కలర్ ఉండాలి, ఎక్స్‌పోజింగ్ చెయ్యాలి.. అప్పుడే షోలకు పిలుస్తారు.. అసలు విషయం బయట పెట్టిన టీవీ నటి
Tv Actress
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2025 | 1:28 PM

Share

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, అవమానాలు, కష్టాలు , తిస్కరణలు అనేవి చాలా కామన్ . చాలా మంది ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు , కష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. చాలా మంది నటీమణులు బయటకు వచ్చి ఇండస్ట్రీలో జరిగే చీకటి కోణాలను బయట పెట్టారు. దర్శక నిర్మాతల పైనే కాదు హీరోల పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ బుల్లితెర నటి టీవీ షోల పై ఊహించని కామెంట్స్ చేసింది. కలర్ ,  ఎక్స్‌పోజింగ్ చేయకపోతే టీవీ షోలకు పిలవరు అని చెప్పి షాక్ ఇచ్చింది. టీవీ షోలో కనిపించాలంటే అంతో ఇంతో ఒళ్లు చూపించాలి, పైగా మంచి రంగు ఉండాలి అని అంటుంది ఆ ముద్దుగుమ్మ. తనను కూడా కలర్ లేదు అని షోకు పిలవలేదు అని అసహనం వ్యక్తం చేసింది. ఇంతకు ఆమె ఎవరు.? అనేది ఒక్కసారి చూద్దాం.!

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు కీర్తి భట్. మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా తెలుగు అడియన్స్ కు పరిచయమైంది కీర్తి. ఆ తర్వాత కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ హిమ పాత్రలో నటించి మరింత దగ్గరయ్యింది. మధురానగరిలో సీరియల్ ద్వారా కీర్తిభట్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం నటిగా కాకుండా బిగ్ బాస్ సీజన్ 6 ఫైనలిస్ట్‏గా నిలిచి మరింత పాపులారిటి సొంతం చేసుకుంది. బిగ్ బాస్ లో ఉండగానే ఈ అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది.

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కీర్తిభట్ సీరియల్స్ తో సినిమాలతో బిజీగా ఉంటుంది అని అనుకున్నారంతా.. కానీ అలా జరగలేదు. కాగా కీర్తి జీవితంలో ఎంతో కష్టాన్ని చూసింది. కారు ప్రమాదంలో మొత్తం కుటుంబాన్ని కోల్పోయి అనాధగా మారింది. అమ్మ, నాన్న, అన్న, వదిన, అన్న పిల్లలు అందరిని పోగొట్టుకుని.. తీవ్రగాయాలతో బతికింది. చాలా కాలం కోమాలో ఉండి ప్రాణాలతో బయటపడింది.ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. జీవితంలో ప్రతి క్షణం పోరాడి గెలిచింది. ఇప్పటివరకు ఓ అనాధగా ఒంటరిగా ఉన్న కీర్తి ఇప్పుడు ఓ ఇంటి కోడలైంది. కన్నడ నటుడు కార్తీక్.. కీర్తిని మనస్పూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. బిగ్‌బాస్‌ 6 అయిపోయాక BB అవార్డ్స్‌ అని అనే కార్యక్రమం చేశారు. కానీ దానికి నన్ను పిలవలేదు.. ఫైనలిస్ట్ అయినా కూడా నన్ను పిలవలేదు. నాకు అర్ధమైంది ఏంటంటే.. షోలకు వెళ్లాలంటే ఇష్టమొచ్చినట్టు  మాట్లాడి కంటెంట్‌ క్రియేట్‌ చేయాలి.  గ్లామరస్ గా ఉండాలి, ఎక్స్‌పోజ్‌ చేయాలి. మంచి రంగు.. ఇవి ఉంటేనే షోలకు పిలుస్తారు. అవన్నీ నా వల్ల కాదు అంటూ చెప్పుకొచ్చింది కీర్తి.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి