AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 సినిమాలు చేస్తే 10ప్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. సోషల్ మీడియా స్టార్ ఈ అమ్మడు

చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.

12 సినిమాలు చేస్తే 10ప్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. సోషల్ మీడియా స్టార్ ఈ అమ్మడు
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2025 | 1:50 PM

Share

అందం, అభినయం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాని హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్ అనేది మాత్రం అందుకోలేకపోతుంది. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఈ మధ్య కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. మరికొంతమంది ఎంత ప్రయత్నించినా స్టార్ డమ్ అందుకోలేకపోతున్నారు. మరికొందరు మాత్రం తొలి చిత్రానికే హిట్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. అలాంటి హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హిట్స్ ప్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. కానీ ఈ అమ్మడుకు సరైన క్రేజ్ మాత్రం రావట్లేదు. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా ఇప్పటికీ స్టార్ స్టేటస్ అందుకోలేదు.

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

కెరీర్ తొలినాళ్లల్లో వరుస ఆఫర్స్ అందుకుంది.. కానీ ఈ బ్యూటీ నటించిన సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. కెరీర్ బిగినింగ్ లోనే పెద్ద హీరోలతో కలిసి నటించింది. కానీ ఆతర్వాత ఈ చిన్నది హిట్స్ అందుకోలేకపోయింది. సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది, చిన్న చిన్న పాత్రలు చేసింది ఆయన కూడా ఈ భామకు హిట్ మాత్రం అందని ద్రాక్షగా మారింది. ఇంతకూ ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల.

ఇవి కూడా చదవండి

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో నే బీటెక్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది. అయితే జాబ్ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. షాదీ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించినందుకు ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత ప్రియదర్శితో కలిసి మల్లేశం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి, పొట్టేల్, తంత్ర తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ హిట్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోతుంది. 12 సినిమాలు చేసిన ఈ అమ్మడు కేవలం 2 హిట్స్ మాత్రమే అందుకుంది.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.