AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య.. ఆ టీడీపీ నేత కుమార్తె అట..!

ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను పాడి గ్లోబల్ సెన్సేషన్ అయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. కాగా ఈ సింగర్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హరిణి రెడ్డి అమ్మాయితో ఆదివారం అతని నిశ్చితార్థం జరిగింది. అయితే ఆ అమ్మాయికి పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని తాజాగా వెల్లడైంది.

Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌కు కాబోయే భార్య.. ఆ టీడీపీ నేత కుమార్తె అట..!
Rahul Sipligunj Harinya Reddy
Ram Naramaneni
|

Updated on: Aug 18, 2025 | 6:06 PM

Share

టాలీవుడ్ ఫేమస్ సింగర్.. రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. హరిణ్య రెడ్డి అనే యువతితో ఆయన నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఆగస్టు 17వ తేదీ, ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడకకు హాజరయ్యారు. రాహుల్ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిశ్చితార్థం ఫోటోలు బయటకు రావడంతో హరిణ్య రెడ్డి ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఇప్పటికే 15 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. రాహుల్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ లవ్‌లో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. కాగా హరిణ్య రెడ్డికి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉంది. ఆమెది తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉండే కుటుంబంగా తెలుస్తుంది. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్య రెడ్డి. కాగా ఆ ఫ్యామిలీ అంతా నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మా అన్న కూతురు హరిణ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది.” అంటూ ఆయన ఫోటోలు షేర్ చేశారు.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..