AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

బిగ్ బాస్ సీజన్ 9 కు సర్వం సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Aug 17, 2025 | 6:57 PM

Share

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో రానుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 9కు సన్నాహాలు అన్ని పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సీజన్ 9పై అంచనాలు పెంచేశాయి. ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి సామాన్య ప్రజలకు అవకాశాలు కల్పిస్తూ.. ఈసారి అగ్నిపరీక్ష అనేది మొదలు పెట్టారు. మరోవైపు ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ అందించేవారిని ఎంపిక చేసేందుకు కంటెస్టెంట్స్ వేటలో ఉంది బిగ్‌బాస్ టీమ్.

సీరియల్‌లో తల్లి.. బయట మాత్రం భార్య.! ఎనిమిదేళ్ల చిన్నవాడిని పెళ్లాడిన ఈ నటి ఎవరంటే

అలాగే సీజన్ 8 కంటే ఈసారి షోలో చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే సీరియల్ తారలతోపాటు ఈసారి సినిమా సెలబ్రెటీలను తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారట. ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ జంట ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఏపీ పొలిటికల్ లో సెన్సేషన్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారని టాక్ వినిపిస్తుంది. ఏపీలో ఎమ్మెల్సీ అయిన శ్రీనివాస్, మాధురి ఎక్కువగా వార్తల్లో నిలిచారు.

ఇవి కూడా చదవండి

14 ఏళ్లల్లోనే ఎంట్రీ.. 300కి పైగా సినిమాలు.. ఇప్పటికీ అదే అందం.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

దువ్వాడ ఫ్యామిలీ వివాదాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి రిలేషన్ బయట పడింది. అయితే ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనుంది అంటున్నారు. బిగ్ బాస్ లో కొంతమంది జంటలు పాల్గొన్న విషయం తెలిసిందే. అలాగే అదే క్యాటగిరిలో ఇప్పుడు ఈ జంట కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంటగా ఎంట్రీ ఇస్తున్నారారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

సీన్ సీన్‌కు సితారే..! ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
వాట్సప్‌ వాడేవారికి అదిరిపోయే సూపర్ న్యూస్
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
GATE 2027 రిజిస్ట్రేషన్ చేయాలంటే DigiLocker తెరవాల్సిందే..!
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈసారి అలాంటి పప్పులుడకవ్..కంటెస్టెంట్లకు నాగ్ స్ట్రాంగ్ వార్నింగ్
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
బోనాల ప్రత్యేకం: తెలంగాణ ప్రజల ఇలవేల్పు మైసిగండి మైసమ్మ ఆలయం..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలెర్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వాన
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
రాహువు కటాక్షం..ఆ రాశుల వారికి కొత్త శుభ యోగాలు!
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్
నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు గ్రీన్ సిగ్నల్