మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుపుల ప్రపంచం.. ఎంతో మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా మారారు. అలాగే ఎంతో మందికి స్ఫూర్తిగా ను నిలిచారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.

సినీ సెలబ్రెటీలు కేవలం నటనలోనే కాదు.. తమ ప్రతిభను ఇతర రంగాల్లోనూ కనబరుస్తూ ఉంటారు.. కొంతమంది స్పోర్ట్స్ లో మరికొంతమంది పెయింటింగ్, ఇంకొంతమంది రేసింగ్ ఇలా రాణిస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్.. మనదగ్గర ఉన్న హీరోయిన్స్ లో చాలా మంది మల్టీ టాలెంటడ్ ముద్దుగుమ్మలు ఉన్నారు వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న నటి ఒకరు. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మెప్పించే ఈ చిన్నది. మరో రంగంలోనూ తన ప్రతిభను చాటుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ మార్షల్ ఆర్ట్స్ లో తోపు ఆమె.. అలాగే బాక్సింగ్ లోనూ నైపుణ్యంలో టాప్. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
Allu Arjun: థియేటర్స్ షేక్ అవ్వాల్సిందే..! అల్లు అర్జున్ సినిమాలో స్టార్ హీరోయిన్ పవర్ ఫుల్ పాత్ర
ఆమె ఎవరో కాదు.. అందాల భామ రితిక సింగ్.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక సింగ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితిక. ఇక అందాల భామ రితికా సింగ్ 16 డిసెంబర్ 1994న ముంబైలో జన్మించింది.. రితిక నటి మాత్రమే కాదు ఆమె గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ కూడా.. చిన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు క్రీడలంటే మక్కువ ఎక్కువ. అంతే కాదు ఆమె బాక్సర్ కూడా..
తమన్నా వద్దు జాన్వీనే కావాలి..! అభిమాని చేసిన పనికి మిల్కీబ్యూటీ షాక్.. నెటిజన్స్ ఏమంటున్నారంటే
అతను 2009లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే సూపర్ ఫైట్ లీగ్‌ను గెలిచింది. దీని తరువాత, ఆమె సుధా కొంగర దర్శకత్వం వహించిన “ఇరుతి చూడ్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో నటిగా అరంగేట్రం చేసింది. అదే సినిమా గురు టైటిల్ తో తెలుగులో రీమేక్ అయ్యింది. మొదట్లో నటనపై ఆసక్తి లేని రితిక తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తొలి సినిమానే సంచలన విజయం సాధించింది. స్పోర్ట్స్ తో పాటు ఆమె సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపించింది. రజనీకాంత్, రాఘవ లారెన్స్, మాధవన్, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ , విజయ్ ఆంటోని వంటి చాలా మంది నటుల చిత్రాలలో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో రితిక షేర్ చేసే ఫోటోలు అభిమానులను కవ్విస్తుంటాయి.
ఇదెక్కడి ఏ సర్టిఫికెట్ సినిమారా బాబు..! టాలీవుడ్‌లో ఇలాంటి బోల్డ్ మూవీ ఉందా.!!
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








