ఇదెక్కడి మాస్ రా మావ..! ఒకే ఇంట్లో సమంత, తమన్నా, రకుల్.. ఇదెలా సాధ్యం
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత.. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్ గా సమంతానే ఉండేది. అయితే గతకొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు.

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్న భామల్లో తమన్నా, సమంత , రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరసలో ఉంటారు. వీరిలో ముందుగా మనం సమంత గురించి చెప్పుకుందాం..! మాయోసైటిన్ మహామమ్మరి నుంచి బయట పడిన సామ్ ఇప్పుడు సినిమాలతో బిజీగా మారాలని ప్రయత్నిస్తుంది. ఇటీవలే నిర్మాతగా మరి సినిమా చేసింది శుభం అనే సినిమా నిర్మించి మంచి విజయాన్ని అందుకుంది. అలాగే హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికే కొన్ని సినిమాలను లైనప్ చేసింది. అలాగే ఈ బ్యూటీ ఓ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ రాజ్ తో సమంత ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక మరో ముద్దుగుమ్మ తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. బాలీవుడ్ లో ఈ చిన్నది సినిమాలు, సిరీస్ లతో దూసుకుపోతుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతుంది తమన్నా.. మరో వయ్యారి భామ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో కనిపించి చాలాకాలం అయ్యింది. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది రకుల్ ప్రీత్ సింగ్ చివరిగా భారతీయుడు 2 సినిమాలో కనిపించింది.. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో తెలుగులో కనిపించడం తగ్గించేసింది ఈ ముద్దుగుమ్మ ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మలు ఒకే ఇంట్లో ఉంటున్నారు.
అవును మీరు విన్నది నిజమే.. తాజాగా సమంత, తమన్నా, రకుల్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌కి అంత రంగం సిద్దమైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఓటర్ లస్ట్ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో సమంత, రకుల్, తమన్నా ఫొటోలతో పాటు వారి అడ్రస్ కూడా ఉంది. వారి పేరుపై ఉన్న ఓటర్లు స్లిప్పులు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఆ ముగ్గురి ఇంటి నెంబర్లు ఒకటే.. దాంతో ఈ ఫోటోల పై ఎన్నికల సంఘం చర్యలకు సిద్ధమైందని తెలుస్తుంది. ఈ ఓటర్ స్లిప్పులు ఫేక్ అని తెలిపింది ఎన్నికల సంఘం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








