ఆ తెలుగు హీరోకి మాత్రమే లిప్‌లాక్ ఇస్తా.. మిల్కీ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
అభిమానులంతా ముద్దగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకునే తమన్నా.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు బాలీవుడ్లోనూ నటిస్తూ యమా బిజీగా గడిపేస్తుంది. కేవలం నటిగానే కాదు స్పెషల్ సాంగ్స్ ల్లోనూ ఊపేస్తోంది ఈ వయ్యారి. నిజం చెప్పాలంటే సినిమాలతో పోల్చుకుంటే.. స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ.

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ అందాల భామ. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా.. ఆతర్వాత హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమా హిట్ అవ్వడంతో తమన్నా క్రేజ్ మారిపోయింది. వరుస సినిమాలో ఛాన్స్ లు అందుకుంది. అలాగే స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ స్టార్ హీరోలతో కలిసి నటించి సక్సెస్ అయ్యింది. కొన్నేళ్ల పాటు తమన్నా టాలీవుడ్ ను ఏలిందనే చెప్పాలి. ఆతర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్
ఎప్పుడైతే తమన్నా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఈ అమ్మడుకి తెలుగులో ఆఫర్స్ తగ్గిపోతూ వచ్చాయి. టాలీవుడ్‌లో చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలవడంతో.. తెలుగు దర్శకులు తమన్నా ను సెలక్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. దాంతో బాలీవుడ్ లో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్‌తో క్రేజ్ పెంచుకుంటుంది. కాగా తమన్నా ఓ టాలీవుడ్ హీరో గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?
లిప్‌లాక్ సీన్స్ మాత్రం ఆ హీరోతోనే చేస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. గతంలో సమంతతో చేసిన ఓ చిట్ చాట్‌లో తమన్నా విజయ్ దేవరకొండకు లిప్ లాక్ ఇస్తాను అని సరదాగా చెప్పింది. ఆ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న ఈనెల 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వీరి పెళ్లి పనులు మొదలయ్యాయి.
ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




