Anushka Shetty: ఇన్‌స్టాలో కేవలం 23 మందినే ఫాలో అవుతున్న స్వీటీ.. వారిలో తెలుగు హీరోలు ఇద్దరే.. ఎవరంటే
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క తన ఇన్‌స్టా ఖాతా నుంచి కేవలం కొద్ది మందిని మాత్రమే ఫాలో అవుతుంది. అందులో ఇద్దరే తెలుగు హీరోలు ఉన్నారు. వారెవరో మీరు గెస్ చేయగలరా...?
Tollywood: బ్యూటీ విత్ బ్రెయిన్.. రగడ సినిమా(Ragada Movie)లో అనుష్కను ఉద్దేశించి నాగార్జున(Nagarjuna Akkineni) చెప్పే డైలాగ్ ఇది. అయితే రియల్ లైఫ్‌లో మాత్రం ఆమెను అందరూ బ్యూటీ విత్ కైండ్ హార్డ్ అంటారు. యస్.. అనుష్క అంటే కేవలం అందం మాత్రమే కాదు.. అణుకువ, దయాగుణం, ఎదుటివారికి రెస్పెక్ట్ ఇచ్చే తత్వం.. మెనీ మోర్ గుడ్ క్వాలిటీస్. అందుకే ఆమె అందరి స్వీటీ. సౌందర్య తర్వాత తెలుగులో అంత మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన అనుష్క శెట్టి. పూరి జగన్నాథ్(Puri Jagannadh), నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ సినిమాతో అనుకోకుండా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనూ. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. మధ్యలో విమెన్ సెంట్రిక్ మూవీస్ చేసి.. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా దక్కించుకుంది. కానీ ఎందుకో ఆ తర్వాత ఆ కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. నిజం చెప్పాలంటే ఆమె పెద్దగా సినిమాలు కూడా ఒప్పుకోవడం లేదు. ప్రజంట్ నవీన్ పొలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఓ తెలుగు మూవీలో ఓ కీ రోల్ చేస్తుంది. అయితే ఆమె వరుస సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా చాలా లేట్‌గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టికి ఇన్‌స్టాలో 5.6 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆమె మాత్రం కేవలం 23 మందినే ఫాలో అవుతుంది. అందులో తెలుగువారే ఎక్కువగా ఉన్నప్పటికీ.. మన హీరోలు మాత్రం ఇద్దరే ఉన్నారు. వారు ఎవరో కాదు అమరేంద్ర బాహుబలి, బల్లాల దేవ. అదే అండీ ప్రభాస్ అండ్ రానా. ఇక హీరోయిన్స్ మాత్రం చాలామంది ఉన్నారు. రాశీ ఖన్నా, హన్సిక, నిహారిక కొణిదెల, కీర్తి సురేశ్, కాజల్ అగర్వాల్, ఛార్మీ, ప్రొడ్యూసర్ నీలిమ గుణశేఖర్ వంటి వారిని అనుష్క ఫాలో అవుతుంది. ఇంకా ఆమె లిస్ట్‌లో ప్రకాశ్ రాజ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా లాంటివారు కూడా ఉన్నారు.
View this post on Instagram