Tollywood News: నేటి నుంచి షూటింగ్స్ బంద్.. ఉపాది కోల్పోనున్న 10వేల మంది కార్మికులు..

సినిమాలను ఓటీటీలకు 8 లేదా పది వారాల తర్వాత మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే టికెట్స్ రేట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుందామని..

Tollywood News: నేటి నుంచి షూటింగ్స్ బంద్.. ఉపాది కోల్పోనున్న 10వేల మంది కార్మికులు..
Tollywood
Follow us

|

Updated on: Aug 01, 2022 | 7:30 AM

ఈరోజు నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ (Tollywood) నిలిచిపోనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను ఆపానున్నట్లు ఇదివరకే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు, ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యాథావిధిగా కొనసాగుతాయి. ఆదివారం ఫిలిం చాంబర్ జనరల్ బాడీ మీటింగ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి ఫిలిం ఛాంబర్ మద్దతు తెలిపింది. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం కావాలని.. అందుకు నిర్మాతలు ఒక్కతాటిపైకీ రావాలని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం సినిమా షూటింగ్స్ నిలిపివేయనున్నట్లు నిర్మాత దిల్ రాజు అన్నారు.

ఈ సమావేశంలో.. సినిమాలను ఓటీటీలకు 8 లేదా పది వారాల తర్వాత మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే టికెట్స్ రేట్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుందామని.. VPF ఛార్జీలపై ఫిలిం ఛాంబర్ బాడీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పెరిగిన నిర్మాణ వ్యయాలు, షూటింగ్ లో వృథా ఖర్చు ఇలాంటి అంశాలన్నింటిపై నిర్మాతలు చర్చించుకోనున్నట్లు తెలిపారు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత షూటింగ్స్ తిరిగి ప్రారంభంచిన్నట్లు వెల్లడించారు.

ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంతో నిర్మాణంలో ఉన్న పెద్ద, చిన్న సినిమాలు దాదాపు 30 వరకు ఆగిపోనున్నాయి. ప్రస్తుతం భాగ్యనగరంలో తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణలు జరుగుతున్నాయి. ఇలా అర్ధాంతరంగా షెడ్యుల్ లో వున్న సినిమాలు ఆగిపోవడం వల్ల నిర్మాతలకు భారం మరో పక్క ఆర్టిస్టు డేట్ లు వృథా కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ హైదరాబాద్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ కే, సలార్, నందమూరి బాలకృష్ణ సినిమా, విజయ్ దేవరకొండ ఖుషి, రవితేజ రావణాసుర, నాని దసరా, రామ్ చరణ్ శంకర్ సినిమా, అఖిల్ ఏజెంట్ షూటింగ్స్ జరుగుతున్నాయి. బంద్ ప్రభావంతో దాదాపు 30సినిమాలు షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. షూటింగ్స్ ఆపేయడం వల్ల రోజు వారి వేతనాలు తీసుకొనే జూనియర్ ఆర్టిస్ట్ లు, డ్రైవర్స్, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంద్ ప్రభావం వల్ల ఉపాధి సుమారు 10 వేల మంది కార్మికులు ఉపాది కోల్పోనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.