Naga Chaitanya: సమంతతో మళ్ళీ నటించాల్సి వస్తే ?.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నాగచైతన్య..
సమంతతో విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత ఎక్కడా కూడా సామ్ గురించి పాజిటివ్‍గానే మాట్లాడుతూ వస్తున్నాడు. తాజాగా మరోసారి సమంతతో నటించే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఇటీవలే థాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 11న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. కరీనా కపూర్, అమీర్ ఖాన్, చైతూ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బోడి బాలరాజు పాత్రలో కనిపించనున్నారు చైతూ. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న చైతూ.. తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. సమంతతో విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత ఎక్కడా కూడా సామ్ గురించి పాజిటివ్‍గానే మాట్లాడుతూ వస్తున్నాడు. తాజాగా మరోసారి సమంతతో నటించే విషయంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చైతూను సమంతతో మళ్లీ కలిసి నటిస్తారా ? అని అడిగారు. అందుకు చైతన్య స్పందిస్తూ.. అదే జరిగితే చాలా క్రేజీగా ఉంటుంది. కానీ అది జరుగుతుందా ? లేదా ? అనేది నాకు తెలియదు. ఈ ప్రపంచానికే తెలియాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ నవ్వుతూ చెప్పాడు. గతంలో థాంక్యూ ప్రమోషన్లలోనూ తన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సమంతతో బాగుంటుందని.. మా ఇద్దరి మధ్య అందమైన ప్రేమకథలు వచ్చాయని అన్నారు చైతూ.
అయితే మరోవైపు కాఫీ విత్ కరణ్ షోలో సామ్ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. చైతన్యను తనను ఒకే గదిలో ఉంచితే పదునైన వస్తువులు దాచిపెట్టాల్సి ఉంటుంది తెలిపింది. విడాకుల ప్రక్రియ సామరస్యంగా జరగలేదని.. గతంలో కంటే ప్రస్తుతం తాను మరింత బలంగా ఉన్నట్లు చెప్పింది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.