- Telugu News Photo Gallery Cinema photos Taapsee Pannu Birthday Special Interesting facts of Bollywood actress Taapsee Pannu
Taapsee Pannu : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ వదులుకుని సిల్వర్‌స్ర్కీన్ వైపు.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్
Taapsee Pannu Birthday: ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది తాప్సీ. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి పుట్టిన రోజు నేడు.
Updated on: Aug 01, 2022 | 2:15 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది తాప్సీ. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈ నటి పుట్టిన రోజు నేడు. రిషి కపూర్ నుంచి అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

తాప్సీ ఝుమ్మంది నాదం సినిమాతో కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. సౌత్‌తో పాటు హిందీ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సొంతం చేసుకుంది.

2010 సంవత్సరంలో సినిమా కెరీర్‌ను ఆరంభించింది తాప్సీ. తెలుగులోనే కాకుండా అనేక ఇతర దక్షిణాది భాషా సినిమాల్లో నటించింది. ఇక 2013 సంవత్సరంలో చష్మే బద్దూర్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఢిల్లీలోని సిక్కు కుటుంబంలో జన్మించిన, పన్ను తండ్రి దిల్ మోహన్ వ్యాపారవేత్త. ఆమె తల్లి నిర్మల్జీత్ గృహిణి. తాప్సీ 8 సంవత్సరాల వయస్సు నుంచి భరతనాట్యం నేర్చుకుంది. అంతేకాదు ఆమె శిక్షణ పొందిన స్క్వాష్ క్రీడాకారిణి.

ఢిల్లీలోనే ఎక్కువగా చదువుకున్న తాప్సీ కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పట్టా పొందింది. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పలు ఐటీ దిగ్గజ కంపెనీల్లో విధులు నిర్వర్తించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలోనే మోడలింగ్‌పై మక్కువ పెంచుకుంది. ఆపై సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చింది




