Viral Video: స్టబ్స్‌, నువ్వు సూపరహే.. స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. వైరలవుతోన్న వీడియో

ENG vs SA: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో స్టబ్స్ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. మర్కరమ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ మిడాన్ వైపు ఆడగా.. అక్కడే ఉన్న స్టబ్స్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు.

Viral Video: స్టబ్స్‌, నువ్వు సూపరహే.. స్టన్నింగ్‌ క్యాచ్‌ పట్టిన సౌతాఫ్రికా ప్లేయర్‌.. వైరలవుతోన్న వీడియో
Tristan Stubbs
Follow us
Basha Shek

|

Updated on: Aug 01, 2022 | 9:16 AM

ENG vs SA: సరిగ్గా 4 రోజుల క్రితం (జులై27) టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికాల మధ్య మొదటి మ్యాచ్‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ 234 పరుగులు చేసింది. బదులుగా సఫారీలు బాగానే పోరాడారు. అయితే ఆ జట్టు పోరాటం 193 పరుగుల దగ్గరే ఆగిపోయింది. ప్రొటీస్‌లు ఇక్కడి దాకా వచ్చారంటే అందుకు ప్రధాన కారణం ఆ జట్టు యంగ్‌ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ (Tristan Stubbs). 21 ఏళ్ల ఈ ప్లేయర్‌ కేవలం 28 బంతుల్లోనే 72 రన్స్‌ చేశాడు. ఇందులో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన ఈ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఇప్పుడు ఫీల్డింగ్‌లో తళుక్కుమన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో అతను అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. మర్కరమ్‌ బౌలింగ్‌లో మొయిన్‌ అలీ మిడాన్ వైపు ఆడగా.. అక్కడే ఉన్న స్టబ్స్ అమాంతం గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టుకున్నాడు.. ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ని అలీతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ‘కిర్రాక్‌, స్టన్నింగ్‌ క్యాచ్‌, సూపర్బ్‌’ అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 రన్స్‌ చేసింది. హెండ్రిక్స్‌(70), మర్కరమ్‌(51) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు 16.4 బౌలర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. తబ్రీజ్‌ షమ్సీ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..