Scotland vs New Zealand: ప్రపంచంలో అత్యుత్తుత బ్యాటర్లున్న న్యూజిలాండ్ జట్టు పసికూన స్కాట్లాండ్‌పై విరుచుకుపడింది. శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు చేసింది. పొట్టి ఫార్మాట్‌లో..
Scotland vs New Zealand: టీ20 మ్యాచ్‌లంటేనే బ్యాటర్ల బాదుడుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పిచ్‌తో సంబంధం లేకుండా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడుతూ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే ప్రపంచంలో అత్యుత్తుత బ్యాటర్లున్న న్యూజిలాండ్ జట్టు పసికూన స్కాట్లాండ్‌పై విరుచుకుపడింది. శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు చేసింది. పొట్టి ఫార్మాట్‌లో కివీస్ తరఫున ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు, 18 ఫోర్లు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు శుభారంభమేమీ దక్కలేదు. జట్టు స్కోరు 6 పరుగుల వద్ద ఫిన్ అలెన్ ఔటయ్యాడు. మూడో స్థానంలో దిగిన మార్క్ చాప్‌మన్ అద్భుతం చేశాడు. 44 బంతుల్లో 7 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 83 రన్స్ చేశాడు. అతనితో పాటు మార్క్ బ్రేస్‌వెల్ కేవలం 25 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతని ఇన్నింగ్స్ లో 3 సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. జిమ్మీ నీషమ్ (12 బంతుల్లో 28), డారిల్ మిచెల్ (19 బంతుల్లో 31) తలా ఓ చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 254 పరుగుల స్కోరు సాధించింది. స్కాట్లాండ్ బౌలర్లలో ఒకరు మినహా అందరూ 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. తాహిర్ (4 ఓవర్లలో 54), ఎవాన్స్ (4 ఓవర్లలో62), గావిన్ మెయిన్ (4 ఓవర్లలో 44), మార్క్ వాట్ (3ఓవర్లలో 37) ఇలా భారీగానే రన్స్ ఇచ్చారు.
భారీ స్కోరు ఛేదనకు బరిలోకి దిగని స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా 102 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆ జట్టులో గ్రీవ్స్ మాత్రమే 37 పరుగులు చేయగలిగాడు. అతనితో పాటు కెప్టెన్ రిచీ బారింగ్టన్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో మైకేల్ రిప్పన్ 4 ఓవర్లలో 37 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ నీషమ్ 9 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, మైకేల్ బ్రేస్‌వెల్, బీన్ సేయర్స్ తలా ఒక వికెట్ తీశారు. ఇప్పటికే మొదటి టీ20 గెల్చుకున్న కివీస్ ఈ మ్యాచ్‌తో సిరీస్‌ని కూడా కైవసం చేసుకుంది. నేడు ఇరు జట్ల మధ్య ఏకైక వన్డే మ్యాచ్ జరగనుంది.