CWG 2022: కంగారులను కంగారెత్తించిన రేణుక.. ఇన్‌స్వింగర్‌కు బౌల్డయ్యి బిత్తర చూపులు చూసిన ఆసీస్‌ బ్యాటర్‌

India vs Australia: రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (Renuka Singh Thakur) ధాటికి ఒకనొకదశలో 49 పరుగులకే ఐదు టాపార్డర్‌ వికెట్లు కోల్పోయింది. అలిసా హీలే, మెగ్ లానింగ్‌, బెత్ మూనీ, తాహ‌లియా మెక్‌గ్రాత్‌ వంటి స్టార్‌ బ్యాటర్లను పెవిలియన్‌ పంపించింది.

CWG 2022: కంగారులను కంగారెత్తించిన రేణుక.. ఇన్‌స్వింగర్‌కు బౌల్డయ్యి బిత్తర చూపులు చూసిన ఆసీస్‌ బ్యాటర్‌
Renuka Singh Thakur
Follow us
Basha Shek

|

Updated on: Jul 31, 2022 | 6:38 AM

India vs Australia: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత జట్టు పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆసీస్‌ మొదట తడబడింది. రేణుకా సింగ్‌ ఠాకూర్‌ (Renuka Singh Thakur) ధాటికి ఒకనొకదశలో 49 పరుగులకే ఐదు టాపార్డర్‌ వికెట్లు కోల్పోయింది. అలిసా హీలే, మెగ్ లానింగ్‌, బెత్ మూనీ, తాహ‌లియా మెక్‌గ్రాత్‌ వంటి స్టార్‌ బ్యాటర్లను పెవిలియన్‌ పంపించింది. దీంతో టీమిండియా విజయం ఖాయమనుకున్నారు. అయితే యాష్లే గార్డెనర్‌ అర్ధసెంచరీకి తోడు గ్రేస్ హారిస్ 37 పరుగులతో రాణించడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.

అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనా రేణుక బౌలింగ్‌ అద్భుతమని చెప్పవచ్చు. తన పేస్‌ ఎటాక్‌తో కంగారూలను కంగారెత్తించిన ఆమెపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక తాహలియా మెక్‌గ్రాత్‌ను ఔట్‌ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. రేణుక వేసిన ఇన్‌స్వింగర్‌ బ్యాట్, ప్యాడ్‌ మధ్య నుంచి వెళ్లి వికెట్లను కూల్చేస్తుంది. దీంతో మెక్‌గ్రాత్‌ బేల చూపులు చూస్తూ ఉండిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక భారత జట్టు తన తర్వాతి మ్యాచ్‌లో దాయాది దేశమైన పాకిస్తాన్‌తో తలపడనుంది. రేపు మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..