Viral Video: టీవీలో చేప పిల్లలను చూసి చొంగకార్చుకున్న పిల్లి.. ఆతర్వాత ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు

Viral Video: సోషల్ మీడియా మొత్తం జంతువుల వీడియోలతో నిండిపోయింది. ఫేస్ బుక్ అయినా, ఇన్ స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా ఎక్కడ చూసినా రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ..

Viral Video: టీవీలో చేప పిల్లలను చూసి చొంగకార్చుకున్న పిల్లి..  ఆతర్వాత ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు
Funny Cat
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2022 | 9:29 PM

Viral Video: సోషల్ మీడియా మొత్తం జంతువుల వీడియోలతో నిండిపోయింది. ఫేస్ బుక్ అయినా, ఇన్ స్టాగ్రామ్ అయినా, ట్విట్టర్ అయినా ఎక్కడ చూసినా రకరకాల వీడియోలు కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తాయి. మరికొన్ని వీడియోలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు చాలా ఆశ్చర్యకరంగానూ అనిపిస్తుంటాయి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో చాలా మంది ప్రజలు పిల్లులను పెంచుకోవడానికి ఇష్టపడరు. కానీ విదేశాలలో ప్రజలు పిల్లులను చాలా ఇష్టపడతారు. ఇక ఇంట్లో పిల్లులు ఎలా అల్లరి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా పగలబడి నవ్వుతారు.

ఈ వీడియోలో సోఫాలో హాయిగా కూర్చొని పిల్లి టీవీ చూస్తోంది. ఆకలిగా కూడా ఉందేమో. టీవీలో నీళ్లలో ఈత కొడుతున్న చాలా చేపలను చూసి అత్యాశకు గురైంది. ఇలా చాలా చేపలను చూసిన పిల్లికి నోరూరిందేమో. ఉన్నంట్లుండి వాటిని వేటాడాలనే ఉద్దేశంతో వాటిపైకి దూకింది. నిజానికి, పిల్లి టీవీలోని చేపలను రియల్‌ చేపలుగానే పరిగణించింది. అందుకే వాటిని తిందామని ఒక్క ఉదుటున వాటిపైకి దూకింది. ఫలితంగా నేలపై పడిపోతుంది. ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో nftbadger అకౌంట్‌ పేరుతో షేర్‌ చేశాడు. దీనికి ‘మంచి ప్రయత్నం’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా కేవలం 13 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3.5 మిలియన్లు దాదాపు 35 లక్షలమందికి పైగా వీక్షించారు. 60 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. మరి మీరు కూడా ఈ ఫన్నీవీడియోపై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..