AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: చదువును పంచండి.. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో డిష్ లాగా అమ్మకండి.. ‘సార్’గా అదరగొట్టిన ధనుష్‌

Dhanush SIR: ప్రముఖ కోలీవుడ్‌ నటుడు ధనుష్‌ (Dhanush) మొదటిసారి తెలుగులో నేరుగా హీరోగా నటిస్తోన్న చిత్రం సార్‌(SIR). భీమ్లానాయక్‌తో టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న సంయుక్త మేనన్‌ (Samyuktha Menon) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిప్రేమ, మిస్టర్‌ మజ్ఞు, రంగ్‌ దే లాంటి విభిన్న ..

Dhanush: చదువును పంచండి.. ఫైవ్‌ స్టార్‌ హోటల్లో డిష్ లాగా అమ్మకండి.. 'సార్'గా అదరగొట్టిన ధనుష్‌
Dhanush
Basha Shek
|

Updated on: Jul 28, 2022 | 7:42 PM

Share

Dhanush SIR: ప్రముఖ కోలీవుడ్‌ నటుడు ధనుష్‌ (Dhanush) మొదటిసారి తెలుగులో నేరుగా హీరోగా నటిస్తోన్న చిత్రం సార్‌(SIR). భీమ్లానాయక్‌తో టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న సంయుక్త మేనన్‌ (Samyuktha Menon) ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. తొలిప్రేమ, మిస్టర్‌ మజ్ఞు, రంగ్‌ దే లాంటి విభిన్న ప్రేమకథా చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ సినిమాకు దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో (వాతి) తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. కాగా నేడు ధనుష్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సార్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ధనుష్‌ లెక్చరర్‌గా కనిపించనున్నారు. ఆయన స్మార్ట్‌ లుక్‌, క్లాస్‌ డైలాగ్స్‌ టీజర్‌లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

‘జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్. మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్. ఇదే రా ఇప్పటి ట్రెండ్. విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం. పంచండి.. కానీ ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి’ అంటూ ధనుష్‌ నోట వచ్చే డైలాగులు అభిమానులతో ఈలలు కొట్టిస్తున్నాయి. కాగా ప్రస్తుత విద్యా వ్యవస్థను నేపథ్యంగా తీసుకుని యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్లతో పాటు సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. జి. వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: యువరాజ్‌, కూర్పు: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబరులో విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..