Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Gain Tips: బక్క పలచగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తీసుకోండి

Diet For Weight Gain: ఈ రోజుల్లో చాలా మంది బరువు గురించి తెగ ఆందోళన చెందుతున్నారు. కొందరేమో అధిక బరువుతో స్లిమ్‌గా మారాలని చూస్తుంటే సన్నగా ఉన్నవారు బరువు పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇందుకోసం కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు.

Weight Gain Tips: బక్క పలచగా ఉన్నారా? బరువు పెరగాలనుకుంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తీసుకోండి
Weight Gain Foods
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2022 | 6:42 PM

Diet For Weight Gain: ఈ రోజుల్లో చాలా మంది బరువు గురించి తెగ ఆందోళన చెందుతున్నారు. కొందరేమో అధిక బరువుతో స్లిమ్‌గా మారాలని చూస్తుంటే సన్నగా ఉన్నవారు బరువు పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇందుకోసం కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. బరువు తగ్గించుకోవడం సంగతి పక్కన పెడితే బరువు పెంచుకునేందుకు ఆరోగ్యకరమైన మార్గాలనే ఎంచుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు. ముఖ్యంగా ఉన్నపళంగా బరువు పెరగాలనే ఆలోచనలను విరమించుకోవాలంటున్నారు. వీటికి బదులు కొన్ని సూపర్‌ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

అరటిపండ్లు బరువు పెరగడానికి అరటిపండ్లను తినవచ్చు. ఇందులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతాయి. మీరు ప్రతిరోజూ కనీసం 3 నుంచి 4 అరటిపండ్లను తినవచ్చు. పాలతో కలిపి మిల్క్ షేక్‌ను తయారుచేసుకుని తీసుకోవచ్చు. ఇది చాలా రుచికరమైనది అలాగే చాలా ఆరోగ్యకరమైనది.

గుడ్డు బరువు పెరగడానికి గుడ్డు కూడా మంచి ఎంపిక. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు, క్యాలరీలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. రోజూ ఉడికించిన గుడ్లను తింటే బరువు పెరగవచ్చు. వీటితో పలు ఆరోగ్యప్రయోజనాలు కూడా చేకూరుతాయి.

ఇవి కూడా చదవండి

నెయ్యి వేడి వేడి రోటీల మీద నెయ్యి రాసుకుని తింటే ఉండే ఆ మజాయే వేరు. బరువు పెరగడానికి ఇది చాలా ఆరోగ్యకరమైన మార్గం. నెయ్యికి పంచదార కలిపి కూడా తీసుకోవచ్చు. ఇందులో క్యాలరీలు, కొవ్వులు అధిక పరిమాణంలో ఉంటాయి కాబట్టి బరువు పెరగవచ్చు.

బాదంపప్పు బాదం పప్పు మెదడుకు పదును పెడుతుంది. ఇక పాలలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. మీరు 3 నుండి 4 బాదంపప్పులను రాత్రిపూట నానబెట్టవచ్చు. మరుసటి రోజు దీన్ని మెత్తగా చేసి పాలలో కలుపుకుని తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు పెరుగుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..