తమిళనాడులో రజనీ.. ఇండియాలో అక్షయ్‌.. ఈ హైయ్యెస్ట్‌ ట్యాక్స్‌ పేయర్ల ఆస్తులేంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Rajinikanth And Akshay Kumar: సౌత్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈ చర్చ వారి సినిమాలతో కాదు. వారి ఆస్తుల విషయంలో.

తమిళనాడులో రజనీ.. ఇండియాలో అక్షయ్‌.. ఈ హైయ్యెస్ట్‌ ట్యాక్స్‌ పేయర్ల ఆస్తులేంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Rajinikanth And Akshay Kuma
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2022 | 8:06 PM

Rajinikanth And Akshay Kumar: సౌత్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్‌ అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈ చర్చ వారి సినిమాలతో కాదు. వారి ఆస్తుల విషయంలో. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించే నటుడిగా రజనీకాంత్‌ను ఆ రాష్ట్ర ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఘనంగా సత్కరించారు. అదే సమయంలో బాలీవుడ్‌ లో అత్యధిక పన్ను చెల్లించే నటుడిగా అక్షయ్‌కుమార్‌గా నిలిచారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దినోత్సవం సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ ఈ సీనియర్‌ నటులిద్దరినీ సత్కరించింది. దీంతో వీరి నికర ఆస్తుల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

రూ.350 కోట్లకు పైగానే..

ఇవి కూడా చదవండి

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు ఆయనను దేవుడిలా కొలుస్తారు. సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించే రజనీ నిజ జీవితంలో ఎంతో సింపుల్‌గా ఉంటారు. అయితే ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకోని తలైవాకు కోట్ల సంపద ఉంది. అలాగే ఆయనకు విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు ఉన్నాయి. సెలబ్రిటీ నెట్‌వర్త్‌పై మీడియా కథనం ప్రకారం, రజనీకాంత్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.365 కోట్లని తెలుస్తోంది. ఆయన ఒక సినిమాకు దాదాపు రూ.55 కోట్ల పారితోషకం తీసుకుంటారట. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే.. చెన్నైలోని పోయెష్ గార్డెన్‌లో రజనీకి ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు దాదాపు 35 కోట్లు. ఇక ఆయన గ్యారేజ్లో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రూ.22 కోట్ల కస్టమైజ్డ్‌ లిమోసిన్‌తో పాటు దాదాపు రూ.17 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఈ సూపర్‌స్టార్‌ గ్యారేజ్‌లో ఉన్నాయట. అలాగే రజనీ పేరు మీద ‘రాఘవేంద్ర మండపం’ అనే కల్యాణ మండపం ఉంది. నివేదికల ప్రకారం దీని ధర రూ.20 కోట్ల వరకు ఉందట. అయితే కోట్లు విలువజేసే ఆస్తులున్నా ఆయన బాధ్యతగా సకాలంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ఈక్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ రజనీని ఘనంగా సన్మానించింది.

కెనడాలోనూ ఆస్తులు..

ఇక బాలీవుడ్‌లో అత్యధికంగా పన్ను చెల్లించే నటుడిగా కూడా అక్షయ్ కుమార్ నిలిచాడు. మీడియా నివేదికల ప్రకారం మొత్తం అక్షయ్ కుమార్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 369 కోట్లని తెలుస్తోంది. ఆయన ఒక్కో సినిమా కోసం రూ.100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటారట. ఆయనకు సినిమాలతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయి. ఈ నటుడికి ఇండియాతో పాటు కెనడాలోనూ విలాసవంతమైన భవనాలు, కార్లు ఉన్నాయి. ఒక ప్రైవేట్‌ జెట్‌ కూడా ఈ ఖిలాడీ దగ్గర ఉంది. దీని విలువ దాదాపు రూ. 260 కోట్లు.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ