AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: బోనమెత్తిన సాయిపల్లవి.. నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న విరాటపర్వం డైరెక్టర్‌ ట్వీట్‌

Bonalu 2022: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలను పరిగణిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో ఆడపడుచులు ఎంతో అందంగా ముస్తాబై అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అలా ఈరోజు (జులై 24) భాగ్యనగరంలో ఆషాడం బోనాలు వేడుకగా జరుగుతున్నాయి.

Sai Pallavi: బోనమెత్తిన సాయిపల్లవి.. నెట్టింట్లో ట్రెండ్‌ అవుతోన్న విరాటపర్వం డైరెక్టర్‌ ట్వీట్‌
Sai Pallavi
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2022 | 6:29 PM

Bonalu 2022: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలను పరిగణిస్తారు. ఈ ప్రత్యేక రోజుల్లో ఆడపడుచులు ఎంతో అందంగా ముస్తాబై అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అలా ఈరోజు (జులై 24) భాగ్యనగరంలో ఆషాడం బోనాలు వేడుకగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా వాళ్లకు కూడా బోనాల ఉత్సవాలు ఒక మెయిన్‌ పాయింట్‌. ఇప్పటికే చాలా సినిమాల్లో ఈ ఉత్సవాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలను పొందుపర్చి ఆకట్టుకున్నారు. అలా ఇటీవల వచ్చిన విరాటపర్వం సినిమాల్లోనూ బోనాల సన్నివేశాలతో తెలంగాణ ప్రజల సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించారు డైరెక్టర్‌ వేణు ఊడుగుల. దగ్గురాటి రానా, సాయిపల్లవి (Sai PallavI) ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో భాగంగా ఒక సన్నివేశంలో నటి సాయిపల్లవి లంగావోణి ధరించి అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొస్తుంది. సినిమాలో ఈ సన్నివేశాలు హైలెట్‌గా నిలిచాయి.

ఈక్రమంలో బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని డైరెక్టర్‌ వేణు విరాట‌ప‌ర్వం సినిమాలోని సాయిపల్లవి స్టిల్స్ ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘గ్రామీణ జీవన సంస్కృతికి,ప్రకృతికి, పర్యావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ! ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక’ అంటూ అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. తన పోస్టుకు #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో గాజు పగిలితే ఎటువంటి శకునమో తెలుసా..
ఇంట్లో గాజు పగిలితే ఎటువంటి శకునమో తెలుసా..
గురువు పాదాలకు కోహ్లీ నమస్కారం! ఫ్యాన్స్ ఫిదా
గురువు పాదాలకు కోహ్లీ నమస్కారం! ఫ్యాన్స్ ఫిదా
జెమినీ ఏఐ సేవలను విస్తరించనున్న గూగుల్.. యూజర్లకు మరింత ప్రయోజనం
జెమినీ ఏఐ సేవలను విస్తరించనున్న గూగుల్.. యూజర్లకు మరింత ప్రయోజనం
కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్
మేడం సార్‌.. మేడం అంతే! 70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే..
మేడం సార్‌.. మేడం అంతే! 70 ఏళ్ల నాటి అమ్మమ్మ చీరలో పూజా హెగ్డే..
TGPSC గ్రూప్‌ 1పై HCలో తప్పుడు అఫిడవిట్‌.. పిటిషనర్లకు జరిమానా!
TGPSC గ్రూప్‌ 1పై HCలో తప్పుడు అఫిడవిట్‌.. పిటిషనర్లకు జరిమానా!
ఉగ్రవాదానికి బిర్యానీతో కాదు, బుల్లెట్లతో బుద్ధి: బీజేపీ
ఉగ్రవాదానికి బిర్యానీతో కాదు, బుల్లెట్లతో బుద్ధి: బీజేపీ
వర్షాల కోసం సోమయాగం పరిశోధన కోసం ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తల
వర్షాల కోసం సోమయాగం పరిశోధన కోసం ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తల
ఏసీ అవసరం లేదు.. ఇంటిని కూల్ చేయడానికి ఈ టిప్స్ తెలిస్తే చాలు..
ఏసీ అవసరం లేదు.. ఇంటిని కూల్ చేయడానికి ఈ టిప్స్ తెలిస్తే చాలు..
బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై..
బిహార్‌లో దారుణం.. ట్రైన్‌ కోసం వెయిట్‌ చేస్తున్న యువతిపై..