Viral Video: వికెట్ తీయగానే గెంతులే గెంతులు.. ఇలాంటి సెలబ్రేషన్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్
Cricket: వికెట్ తీసిన బౌలర్లు, సెంచరీలు చేసిన బ్యాటర్లు సంబరాలు చేసుకోవడం సహజం. అందులో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ముఖ్యంగా కరేబియన్ క్రికెటర్లు ఇలాంటి యూనిక్ సెలబ్రేషన్స్‌లో బాగా సిద్ధ హస్తులు. గేల్, బ్రావో, షెల్డన్ కాట్రెల్ తదితర ఆటగాళ్లు డ్యాన్స్‌లు చేస్తూ, గెంతులు వేస్తూ..
Cricket: వికెట్ తీసిన బౌలర్లు, సెంచరీలు చేసిన బ్యాటర్లు సంబరాలు చేసుకోవడం సహజం. అందులో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ముఖ్యంగా కరేబియన్ క్రికెటర్లు ఇలాంటి యూనిక్ సెలబ్రేషన్స్‌లో బాగా సిద్ధ హస్తులు. గేల్, బ్రావో, షెల్డన్ కాట్రెల్ తదితర ఆటగాళ్లు డ్యాన్స్‌లు చేస్తూ, గెంతులు వేస్తూ, సెల్యూట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం మనం చూసే ఉంటాం. ఇక నాగినీ డ్యాన్స్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్‌కి బాగా గుర్తుండే ఉంటుంది. తాజాగా సెర్బియాకు చెందిన అయో మేనే ఎజెగి అనే ఓ క్రికెటర్ కూడా వినూత్న సెలబ్రేషన్స్‌తో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మెరిశాడు. వివరాల్లోకి వెళితే..ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సబ్ రీజియన్ క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా సెర్బియా, ఐల్ ఆఫ్ మ్యాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఎజెగి నాలుగు వికెట్లతో రాణించాడు. అయితే వికెట్ తీసిన సందర్భంలో మైదానంలోనే పల్టీలు (ఫ్లిఫ్)లు వేస్తూ ఆతర్వాత నేలపై తన చేతులను చాచి బోర్లా పడుకున్నాడు. ఈ వెరైటీ సెలబ్రేషన్స్ ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు గ్యాలరీలోని ప్రేక్షకుల చేత నవ్వులు పూయించింది.
ఇక ఈ వీడియోను చూసి ఐసీసీకి కూడా ముచ్చటేసింది. అందుకే అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. ‘వికెట్ సాధించిన ఆనందంతో సెలబ్రేషన్ చేసుకున్న సెర్బియా క్రికెటర్ అయో మేనేఎగిజి ‘ అని షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతోంది. క్రికెట్ ఫ్యాన్స్ షేర్లు, కామెంట్లు కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెర్బియా 20 ఓవర్లు ఆడినప్పటికీ 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే సెర్బియా ఓడిపోయినా ఆ జట్టు బౌలర్ ఎజెగి సెలబ్రేషన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మరి నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..