Ind vs Aus: హైదరాబాద్‌లో ఆసీస్, భారత్ జట్ల మధ్య ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే?
Hyderabad: కరోనా నేపథ్యంలో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఈ నేపథ్యంలో సుమారు రెండున్నరేళ్ల తర్వాత భాగ్యనగరం ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది..
Hyderabad: కరోనా నేపథ్యంలో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఈ నేపథ్యంలో సుమారు రెండున్నరేళ్ల తర్వాత భాగ్యనగరం ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు వీలైనన్ని ఎక్కువగా టీ20 మ్యాచ్‌లు ఆడాలని భావిస్తోంది టీమిండియా. ఇందులో భాగంగా సఫారీలు, కంగారులతో స్వదేశంలో టీ20 సిరీస్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25న హైదరాబాద్ వేదికగా పటిష్ఠమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత జట్టు. అంతకుముందు సెప్టెంబర్ 20, 23 తేదీల్లో మొహాలీ, నాగ్‌పూర్ వేదికగా వరుసగా మొదటి, రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
పూర్తి షెడ్యూల్ ఇదే..
కాగా గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. దీని ప్రకారం..
ఆసీస్‌తో టీ20 సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20 మ్యాచ్- సెప్టెంబర్20- మొహాలి
- 2వ టీ20- సెప్టెంబర్ 23- నాగ్‌పూర్
- 3వ టీ20- సెప్టెంబర్25- హైదరాబాద్
దక్షిణాఫ్రికాతో సిరీస్ షెడ్యూల్
- మొదటి టీ20- సెప్టెంబర్ 28- త్రివేండ్రం
- 2వ టీ20- అక్టోబర్ 1- గువహటి
- 3వ టీ20- అక్టోబర్ 3- ఇండోర్
- మొదటి వన్డే- అక్టోబర్ 6 – రాంచీ
- 2వ వన్డే – అక్టోబర్ 9- లక్నో
- 3వ వన్డే- అక్టోబర్ 11- ఢిల్లీ
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..