Viral News: మహిళకు I Like U మెసేజ్‌.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్

Punjab: స్మార్ట్‌ఫోన్ వచ్చాక సోషల్‌ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఇలా అన్ని రకాల సామాజిక మాధ్యమాలను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. కొందరైతే ఏ మాత్రం పరిచయం లేని వారికి కూడా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపడం..

Viral News: మహిళకు I Like U మెసేజ్‌.. కుళ్లబొడిచిన భర్త.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
Follow us
Basha Shek

|

Updated on: Jul 21, 2022 | 8:20 AM

Punjab: స్మార్ట్‌ఫోన్ వచ్చాక సోషల్‌ మీడియా విస్తృతి బాగా పెరిగిపోయింది. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్ ఇలా అన్ని రకాల సామాజిక మాధ్యమాలను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. కొందరైతే ఏ మాత్రం పరిచయం లేని వారికి కూడా ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపడం, అసభ్యకర సందేశాలు పంపడం లాంటివి చేస్తున్నారు. ఇక మహిళలు అయితే సోషల్‌ మీడియాలో ఎన్నో వేధింపులు ఎదుర్కొంటున్నారు. బాధితులు కొందరు మనసులోనే తమ బాధను దాచుకుంటుంటే.. మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియా వినియోగానికి సంబంధించి పంజాబ్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఒక నెటిజన్‌ ఏ మాత్రం పరిచయం లేని వివాహితకు ‘నువ్వు నాకు నచ్చావ్‌ ( I Like You)’ అని టెక్ట్స్‌ మెసేజ్ పంపించాడు. చూడగానే ఆమెకు కోపం వచ్చింది. ‘ఏవండీ.. వీడెవడో నాకు తెలీదు. ఈ మెసేజ్ పంపాడు’ అని తన భర్తకు చూపించింది. దీంతో అతను ఆ మెసేజ్‌ ఏ మొబైల్‌ నుంచి వచ్చిందో కనిపెట్టాడు. ఆ నంబర్ సహాయంతో ఇంటి అడ్రెస్ కనిపెట్టాడు. ఆ అడ్రస్‌కు వెళ్లి మెసేజ్‌ చేసిన వాడిని బాగా చితకబాదాడు. ‘ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్‌లు పంపినా, మా ఏరియాలో కనిపించినా… మామూలుగా ఉండదు’ అని గట్టిగా హెచ్చరించాడు.

మీపై కూడా కఠిన చర్యలు ..

ఇవి కూడా చదవండి

వివాహిత భర్త ఈ రేంజ్‌లో కుళ్లబొడుస్తాడని ఊహించని బాధితుడు తన గోడును పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘సార్.. నేను ఒకరికి I Like You అని మెసేజ్ పంపాను. ఆమె భర్త గత రాత్రి వచ్చి నన్ను బాగా చితక్కొ్ట్టాడు. నేను చాలాసార్లు స్వారీ చెప్పాను. అయినా కుళ్లబొడిచాడు. ఇప్పుడు నాకు రక్షణ కావాలి. దయచేసి నాకు హెల్ప్‌ చేయండి. అతను ఇవాళ మళ్లీ నాపై దాడి చెయ్యవచ్చు’ అని పోలీసులకు ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కి స్పందించిన పోలీసులు అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘మీరు ఓ వివాహితకు అలా మెసేజ్‌ చేయడంద్వారా ఏం ఆశిస్తున్నావో మాకైతే తెలియదు. అలాగని వారు మిమ్మల్ని కొట్టడం కూడా కరెక్టు కాదు. మీ గురించి వారు మాకు ఫిర్యాదు చేయాలి. మేం మీకు సరైన సెక్షన్ కింద సరైన శిక్ష వేస్తాం. ఈ రెండు అంశాలపై చట్ట ప్రకారం విచారణ ఉంటుంది. ఇద్దరి పైనా కఠిన చర్యలుంటాయి’ అని పోలీసులు రిప్లై ఇవ్వడంతో బాధితుడు షాక్‌ తిన్నాడు. అంతేకాదు అతన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయమని మరో ట్వీట్‌లో సూచించారు పోలీసులు. దీంతో అటు తిరిగీ, ఇటు తిరిగీ తనకే మళ్లీ స్పాట్‌ పడేలా ఉందని భావించి సైలెంట్ అయిపోయాడు సదరు బాధితుడు .

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..