AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: మరొకరి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్‌.. కరీంగనర్‌ చిన్నారికి సర్జరీ విజయవంతం

Sonu Sood: మరొకరి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్‌.. కరీంగనర్‌ చిన్నారికి సర్జరీ విజయవంతం Telangana: కరోనా సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోన్న వేళ నేనున్నానంటూ ముందుకొచ్చాడు సినీ నటుడు సోనూసూద్‌ (Sonu Sood).

Sonu Sood: మరొకరి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్‌.. కరీంగనర్‌ చిన్నారికి సర్జరీ విజయవంతం
Sonu Sood
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2022 | 6:48 PM

Sonu Sood: మరొకరి ప్రాణాలు నిలబెట్టిన సోనూసూద్‌.. కరీంగనర్‌ చిన్నారికి సర్జరీ విజయవంతం Telangana: కరోనా సంక్షోభంతో దేశం కొట్టుమిట్టాడుతోన్న వేళ నేనున్నానంటూ ముందుకొచ్చాడు సినీ నటుడు సోనూసూద్‌ (Sonu Sood). ఆపత్కాలంలో అడిగిన వారందరికీ ఆపన్నహస్తం అందించి రియల్‌ హీరోగా మారిపోయాడు. కరోనా సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా ఆపదలో ఉన్నవారికి తనవంతు సహయం అందజేసి వార్తల్లో నిలిచాడీ హ్యాండ్సమ్‌ యాక్టర్‌. సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ (Sood Charity Foundation) స్థాపించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమందికి తనవంతు సహాయ సహకారాలు అందించాడీ నటుడు. తన సామాజిక సేవతో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోన్న ఈ ట్యాలెంటెడ్‌ హీరో తాజాగా మ‌రోసారి త‌న గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు.

కరీంనగర్ కి చెందిన మహ్మద్ సఫన్ అలీ అనే ఏడు నెలల చిన్నారి అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. బైలియరీ అట్రీసియా అనే వ్యాధి బారిన ఆ బాలుడు కాలేయం దెబ్బతింది. దీంతో కామెర్లతో పాటు సిర్రోసిస్‌ కూడా సోకింది. చిన్నారి ప్రాణాలు దక్కాలంటే కాలేయమార్పిడి తప్పని సరని వైద్యులు సూచించారు. అయితే ఖర్చుతో కూడుకున్న చికిత్సను మహ్మద్ సఫన్ అలీ తల్లిదండ్రులు భరించే స్థితిలో లేరు. సోనూసూద్ ని సాయం కోరడంతో ఆయన ముందుకు వచ్చారు. సోనూసూద్‌ ఛారిటీ ఫౌండేషన్‌ సహాయంతో తాజాగా కేరళలోని కొచ్చి నగరంలో సఫన్ అలీకి చికిత్స అందించారు. ఎస్తేర్ మెడ్ సిటీ హాస్పిటల్ లో ఏడు నెలల బాలుడైన సఫన్ అలీకి లివర్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
తెలంగాణ టెన్త్ 2025 ఫలితాలు మరింత ఆలస్యం! రిజల్ట్స్ ఎన్నింటికంటే
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
ఢిల్లీ, కోల్‌కతా టీంలకు షాకింగ్ న్యూస్.. గాయాలతో దూరమైన ఇద్దరు
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
తిరుపతి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా..? మీకో బంపర్‌ న్యూస్‌..
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.
జక్కన్న మహాభారతంపై మరోసారి చర్చ.. ఆ హీరో కూడా పక్కా అని క్లారిటీ.