Chef Mantra: శ్రీముఖి రుచికరమైన వంటలు.. శ్రియ అల్లరిచేష్టలు.. సరదా సరదాగా చెఫ్ మంత్ర
Chef Mantra: సరికొత్త సినిమాలు, ఉత్కంఠ కలిగించే వెబ్‌సిరీస్‌లను అందజేస్తూ తెలుగు సినీ ప్రేక్షకులకు వందశాతం వినోదం అందిస్తోంది ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహా (AHA). వీటితో పాటు అన్‌స్టాపబుల్, ఇండియన్ ఐడల్ లాంటి గేమ్‌షోలు, సింగింగ్ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక వంట ప్రియులు,
Chef Mantra: సరికొత్త సినిమాలు, ఉత్కంఠ కలిగించే వెబ్‌సిరీస్‌లను అందజేస్తూ తెలుగు సినీ ప్రేక్షకులకు వందశాతం వినోదం అందిస్తోంది ప్రముఖ ఓటీటీ మాధ్యమం ఆహా (AHA). వీటితో పాటు అన్‌స్టాపబుల్, ఇండియన్ ఐడల్ లాంటి గేమ్‌షోలు, సింగింగ్ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక వంట ప్రియులు, ప్రత్యేకంగా మహిళలకోసం చెఫ్‌మంత్ర (Chef Mantra) పేరుతో కిచెన్ స్పెషల్ ప్రోగ్రామ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రముఖ బుల్లితెర నటి శ్రీముఖి (Sreemukhi) ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఆహా ఇన్ హౌస్ క్రియేటివ్ టీమ్ డెవలప్ చేసిన తొలి షో ఇది. తెలుగు సినిమా పరిశ్రమలోని పలువరు ప్రముఖులు ఈ షోకు హాజరై తమ అభిరుచులను పంచుకున్నారు. కాగా ఈ షోను ఇప్పుడు మళ్లీ టీవీ 9 ఎంటర్టైన్మెంట్(TV9 Entertainment) యూట్యూబ్ ఛానల్‌లో వరుసగా ప్రసారమవుతున్నాయి.
నిజానికి శ్రీముఖి వంటలను బాగా ఆస్వాదిస్తుంది. ఈ షోలో తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది సెలబ్రిటీలు భావోద్వేగాలే కాకుండా మరో కోణాన్ని చూపించారు. ఈ చెఫ్‌మంత్ర మొదటి ఎపిసోడ్‌కు ప్రముఖ హీరోయిన్ రెజీనా కాసాండ్రా గెస్టుగా రాగా, రెండో ఎపిసోడ్‌కు శ్రియాశరణ్ హాజరైంది. దీనికి సంబంధించిన కార్యక్రమం ప్రస్తుతం టీవీ9 ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌ఛానల్‌లో ప్రసారమవుతోంది. మరి యాంకర్ శ్రీముఖి చేసిన రుచికరమైన వంటలతో పాటు శ్రియా చేసిన అల్లరి చేష్టలను టీవీ 9 ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్‌లో చూసి ఆనందించండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..