Viral video: అనవసరంగా గెలికితే ఇట్లాగే ఉంటది మరి.. చిరాకు తెప్పించిన యువతిని గొర్రె ఏం చేసిందో మీరే చూడండి

Viral video:  పులి, సింహం, ఏనుగు లాంటి క్రూర జంతువులను చూస్తే ఎవరైనా జడుసుకుంటారు. అందుకే వాటి జోలికి వెళ్లం కదా సరి ఎక్కడైనా కనిపిస్తే ఆమడదూరం పారిపోతాం. అదే సమయంలో ఆవు, గేదె, కుక్క, పిల్లి, మేక, గొర్రె లాంటి సాధుజంతువులతో మనం సరదాగా ఆడుకుంటాం. అయితే కొంతమంది ఈ జంతువులతో..

Viral video: అనవసరంగా గెలికితే ఇట్లాగే ఉంటది మరి.. చిరాకు తెప్పించిన యువతిని గొర్రె ఏం చేసిందో మీరే చూడండి
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2022 | 3:40 PM

Viral video:  పులి, సింహం, ఏనుగు లాంటి క్రూర జంతువులను చూస్తే ఎవరైనా జడుసుకుంటారు. అందుకే వాటి జోలికి వెళ్లం కదా సరి ఎక్కడైనా కనిపిస్తే ఆమడదూరం పారిపోతాం. అదే సమయంలో ఆవు, గేదె, కుక్క, పిల్లి, మేక, గొర్రె లాంటి సాధుజంతువులతో మనం సరదాగా ఆడుకుంటాం. అయితే కొంతమంది ఈ జంతువులతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అత్యుత్సాహంతో వాటి పట్ల అమానుషంగా వ్యవహరిస్తుంటారు. ఈక్రమంలో ఒక్కోసారి సాధు జంతువులకు కూడా పట్టరాని కోపం వస్తుంది. అనవసరంగా గెలికితే ఎవరని చూడకుండా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంటాయి. దాడులకు కూడా పాల్పడుతుంటాయి. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.

ఈ వీడియోలో ఇద్దరు యువతులు గొర్రెలు ఉండే చోటుకు వెళతారు. అందులో ఒక గొర్రె ఇటీవలే ప్రసవించింది. ఆ చిన్ని గొర్రెను ఓ యువతి ఎత్తకుని ఆడుకుంటుంది. తన బిడ్డను ఎత్తుకెళుందని గొర్రె ఆమెను బెదరిస్తుంది. ఇంతలో యువతి గొర్రెను బెదిరిస్తుంది. దాంతో చిర్రెత్తిపోయిన ఆ గొర్రె.. యువతిని గుద్దేస్తుంది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే కిందపడగా.. గొర్రె పిల్ల కూడా ఆమె చేతుల్లోంచి కిందపడిపోతుంది. యువతి లేవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మరోసారి ఆమెపై గొర్రె దాడి చేస్తుంది. ఇంతలో పక్కనున్న యువతి వచ్చి ఆమెను కాపాడి పక్కకు తీసుకెళ్లితుంది. బ్యూటీ.వైల్డ్ లైఫ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్‌ రావడంతో పాటు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘అనవసరంగా గెలికితే ఇట్లే ఉంటది మరి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..