AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Gopal Varma: వివాదంలో రాంగోపాల్ వర్మ లడికి సినిమా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ..

తాను నిర్మించిన లడికి సినిమాను ఆపాలంటూ నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Ram Gopal Varma: వివాదంలో రాంగోపాల్ వర్మ లడికి సినిమా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ..
Rajitha Chanti
|

Updated on: Jul 20, 2022 | 12:21 PM

Share

లడికి సినిమా రిలీజ్ కాకుండా కొంతమంది సంతకాలతో ఆపుతున్నారని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సినిమాను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. రవికుమార్ రెడ్డి అనే వ్యక్తితోపాటు శేఖర్ రాజు, మరొక ఇద్దరు పైన ఫిర్యాదు చేశారు ఆర్జీవీ. అలాగే లడికి సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారంటూ.. పూర్తి వివరాలను తెలియజేస్తూ వర్మ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

“లడికి సినిమా స్క్రీనింగ్ ఆపు చేయాలి అని ఇద్దరు దొంగ కాగితాలతో అబద్ధపు స్టేట్మెంట్లతో ఫోర్జరీ సంతకాలతో కోర్టు ద్వారా స్టే తీసుకువచ్చారు. కానీ కోర్టులో ఆ ఇద్దరి స్టేలని కొట్టివేసి నా లడికి ( అమ్మాయి ) సినిమాకి క్లియరెన్స్ ఇచ్చారు. నా సినిమాని ఇబ్బంది పెట్టాలని చూసిన వారిపై చట్టరీత్యా అనేక సెక్షన్ల కింద చర్య తీసుకోబోతున్నాను. నా కంపెనీ లెటర్ హెడ్ ని ఫోర్జరీ చేసిన ఎన్.రవి కుమార్ రెడ్డి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు ఫైల్ చేయడమే కాకుండా రన్నింగ్ లో ఉన్న నా సినిమాను ఆపినందుకు పరువు నష్టం, నాకు జరిగిన నష్టపరిహారాన్ని కోర్టు ద్వారా వసూలు చేస్తాను. నేనే కాకుండా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆస్ట్రీ ( Artsee media ) మీడియా, పారిజాత మూవీ క్రియేషన్స్ కూడా ఆ ఇద్దరి మీద కేసులు పెట్టబోతున్నారు. ఇక శేఖర్ రాజ్ అనే వ్యక్తి కోర్టులో అబద్ధపు స్టేట్మెంట్లతో కోర్టు వారిని మభ్య పెట్టిన విషయంలో అదే కోర్టులో ఫోర్జరీ నేరం కింద కంప్లైంట్ నమోదు చేయబోతున్నాము”. అని ప్రెస్ నోట్‏లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

తాను నిర్మించిన లడికి సినిమాను ఆపాలంటూ నిర్మాత శేకర్ రాజు కోర్టులో ఫిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా చేయడం కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు ఇచ్చానని.. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా వర్మ దాటవేస్తూ వస్తున్నాడని ఫిర్యాదులో తెలిపారు శేఖర్ రాజు. ఈ విషయమై తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించానని అన్నారు. ఇదే అంశంపై ఈరోజు పంజాగుట్ట పీఎస్ లో వర్మ ఫిర్యాదు చేశారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!