Samantha: సమంతను ఎత్తుకొని తీసుకొచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో.. కరణ్ షోలో సామ్ సందడి మాములుగా లేదుగా..

తాజాగా ఇందులో టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha), బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. వీరిద్దరికి సంబంధించిన ప్రోమోను కరణ్ జోహార్ తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు.

Samantha: సమంతను ఎత్తుకొని తీసుకొచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో.. కరణ్ షోలో సామ్ సందడి మాములుగా లేదుగా..
Koffee With Karan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 20, 2022 | 7:16 AM

బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హోస్ట్‏గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షో (Koffee With Karan 7)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రోగ్రామ్‏లో ఇప్పటికే అలియా, రణవీర్ సింగ్, జాహ్నవీ కపూర్, సారా అలీఖాన్ సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha), బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. వీరిద్దరికి సంబంధించిన ప్రోమోను కరణ్ జోహార్ తన ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. హార్ట్ ఆఫ్ గోల్డ్ డ్యాష్ ఆఫ్ సెక్సీ, బోల్డ్.. నా కొత్త అతిథులు నాషోకు విచ్చేశారు అంటూ కరణ్ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

షోలోకి ఎంట్రీ అవుతూనే సమంతను తన చేతులపై ఎత్తుకుని తీసుకువచ్చాడు హీరో అక్షయ్ కుమార్. అనంతరం ఇద్దరు సీట్లో కూర్చుని కరణ్ ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పారు. ఆ తర్వాత సమంత పెళ్లి గురించి కరణ్ అడగ్గా.. పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండకపోవడానికి కారణం మీరే అంటూ సామ్ చెప్పింది. అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీని హోస్ట్ చేస్తే బాలీవుడ్ హీరోలలో ఏ ఇద్దరితో డ్యాన్స్ చేయిస్తారని ప్రశ్నించగా.. రణవీర్ సింగ్ పేరు చెప్పేసింది. ఇక చివరలో సామ్, అక్షయ్ సరదగా డ్యాన్స్ చేయగా.. సమంతను ఎత్తుకుని తిప్పేశాడు అక్షయ్. సమంత, అక్షయ్ చేసిన సరదా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ షో మరో రెండు రోజుల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?