Rocketry: The Nambi Effect: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. ‘రాకెట్రీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరో మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు.

Rocketry: The Nambi Effect: ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ.. 'రాకెట్రీ' స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Rocketry
Follow us

|

Updated on: Jul 20, 2022 | 12:00 PM

తమిళ్ స్టార్ ఆర్ మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ (Rocketry: The Nambi Effect). ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా జూలై 1న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా మాధవన్ దర్శకత్వం, నటనకు సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్‏లో రాకెట్రీ మూవీ జూలై 26న స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఇది అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాకెట్రీ నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. రూ. 25 కోట్ల బడ్జెట్‏తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 40 కోట్లు వసూళు చేసినట్లు సినీ వర్గాల అంచనా. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా హీరో మాధవన్ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. అతను సాధించిన విజయాలు, అతనిపై తప్పుడు ఆరోపణలు చేసిన గూఢచారి కేసు, అతను నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసిన పోరాటాన్ని రాకెట్రీ సినిమాలో చక్కగా చూపించారు. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. ఇందులో సిమ్రాన్, రవి రాఘవేంద్ర, మిషా ఘోషాల్ కీలకపాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.