Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Model Pooja Sarkar: ప్రియుడి నుంచి ఫోన్ కాల్.. కట్ చేస్తే.. చిన్న వయసులోనే మోడల్ అనుహ్య నిర్ణయం..

పూజా ఉత్తర పరగణాస్ జిల్లాలోని గోబర్దంగా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని తన స్నేహితురాలితో కలిసి నివసిస్తోంది.

Model Pooja Sarkar: ప్రియుడి నుంచి ఫోన్ కాల్.. కట్ చేస్తే.. చిన్న వయసులోనే మోడల్ అనుహ్య నిర్ణయం..
Pooja Sarkar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 20, 2022 | 9:03 AM

చిత్రపరిశ్రమలో హీరోయిన్‏గా ఎదగాలని ఎన్నో కలలతో మోడల్‏గా కెరీర్ ఆరంభిస్తున్నారు. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని తనువు చాలిస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా మోడల్స్ వరుసగా సూసైడ్ చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజులుగా పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత మూడు నెలలో కోల్ కత్తాలో మోడల్ ఆత్మహత్య చేసుకోవడం ఇది నాల్గవది. పూజా సర్కార్ (Model Pooja Sarkar) అనే 21 ఏళ్ల మోడల్ ఆదివారం కోల్ కత్తాలోని తాను అద్దెకు ఉంటున్న ఇంట్లో విగతజీవిగా కనిపించింది. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలిపారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు పోలీసులు.

పూజా ఉత్తర పరగణాస్ జిల్లాలోని గోబర్దంగా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దక్షిణ కోల్‌కతాలోని బాన్స్‌ద్రోని ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకుని తన స్నేహితురాలితో కలిసి నివసిస్తోంది. శనివారం సాయంత్రం పూజ తన స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు వెళ్లింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత అర్ధరాత్రికి ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుంది. దీంతో ఆమె ఫోన్ కు తన స్నేహితురాలు ఎన్నిసార్లు ఫోన్ చేసిన పూజా లిఫ్ట్ చేయలేదు. ఎంత ప్రయత్నించిన తలుపు తీయలేదు. దీంతో ఆమె స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. పూజ సీలింగ్ ఫ్యాన్‏కు వేలాడుతూ కనిపించింది. పూజా చనిపోవడానికి ముందు ఆమె ప్రియుడి నుంచి ఫోన్ వచ్చిందని ఆమె స్నేహితురాలు పోలీసుల విచారణలో తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పూజా కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడు గోబర్దంగాలో నివసిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే కోల్ కత్తాలో మోడల్స్ పల్లవి డే, బిదిషా డే, మంజుషా నియోగి ఆత్మహత్య చేసుకున్నారు.