- Telugu News Sports News Virat Kohli break: Former India captain Virat Kohli, Anushka Sharma reach Paris for vacation. Check picture
Virat Kohli Paris vacation: ప్యారిస్ ట్రిప్‌లో విరుష్క జంట! క్రికెట్‌కు దూరంగా నెల రోజుల పాటు విరామం..
ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ 20 సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన క్రికెట్ ప్రియులకు నిరాశ కలిగించింది. దీంతో గత కొద్దికాలంగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ఐతే క్రికెట్, సోషల్ మీడియాలకు దూరంగా నెల రోజుల ట్రిప్‌కు విరుష్కాలు దంపతులు బయలుదేరారు. కొహ్లీ కొంత కాలం విరామం తీసుకోవాలని..
Updated on: Jul 20, 2022 | 9:46 AM

ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టీ 20 సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన క్రికెట్ ప్రియులకు నిరాశ కలిగించింది. దీంతో గత కొద్దికాలంగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాడు. ఐతే క్రికెట్, సోషల్ మీడియాలకు దూరంగా నెల రోజుల ట్రిప్‌కు విరుష్కాలు దంపతులు బయలుదేరారు. కొహ్లీ కొంత కాలం విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లండ్ టూర్ ముగిశాక కోహ్లి తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికతో కలిసి లండన్ నుంచి ప్యారిస్‌కు బయలుదేరాడు. ఈ విషయం అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. హలో ఫ్యారీస్.. అనే క్యాప్షన్‌తో హోటల్ గది ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసి ఈ విషయాలన్ని తెల్పింది.

క్రికెట్‌కు విరామం ఇచ్చి ప్యారిస్‌లో తన కుటుంబంతో నెల రోజులపాటు సరదాగా గడిపేందుకు ఈ టూర్ ప్లాన్ చేశాడట.

విరాట్ కోహ్లీ తన క్రికెట్ కెరీర్‌లో ఇప్పటివరకు 70 సెంచరీలు సాధించాడు. ఐతే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. తాజాగా ఇంగ్లండ్‌తో ఆడిన టీ 20లో ఇదే పందా కొనసాగించాడు. దీంతో కొందరు ప్రముఖులు కోహ్లీని భారత్ క్రికెట్ జట్టు నుంచి తప్పించడం మంచిదని.. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు.

కోహ్లి గత రెండేళ్లగా ఫామ్‌లో కొనసాగేందుకు కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఆగస్టు 27 నుంచి జరగనున్న T20 ప్రపంచ కప్ నాటికి కోహ్లీ ఈ టూర్ల ద్వారా తిరిగి పుంజుకుంటాడని అందరూ ఆశిస్తున్నారు.





























